త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gangula Kamalakar | రేవంత్‌ను అంటే బండికెందుకు ఉలుకు..! : గంగుల క‌మ‌లాక‌ర్

Gangula Kamalakar | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని సీఎం రేవంత్ రెడ్డిని అంటే.. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌కు ఎందుకు ఉలుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 6, 2026, 6.04 pm IST

Gangula Kamalakar | రేవంత్‌ను అంటే బండికెందుకు ఉలుకు..! : గంగుల క‌మ‌లాక‌ర్
Advertisement

Gangula Kamalakar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని సీఎం రేవంత్ రెడ్డిని అంటే.. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌కు ఎందుకు ఉలుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గంగుల క‌మ‌లాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్ కరీంనగర్ పర్యటన రాష్ట్రంలో దోపిడి, శాంతి భద్రతలపై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిగా మాట్లాడారు. కేంద్రమైన, రాష్ట్రమైన ప్రశ్నించాల్సిందే. కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేవంత్ రెడ్డి అడగాలి అని కేటీఆర్ అన్నారు. బండి సంజ‌యేమో ఇష్టానుసారంగా కేటీఆర్‌పై మాట్లాడారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఆయన భాష బాగోలేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన బీజేపీ కార్యకర్తగా విమర్శిస్తున్నారు. తల్లి, తండ్రి అనే పదాలు వాడుతూ ఫ్రస్టేషన్‌లో తిడుతున్నార‌ని క‌మ‌లాక‌ర్ ధ్వ‌జ‌మెత్తారు.

రేవంత్ రెడ్డిని అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావ్. కేటీఆర్‌పైన వాడిన భాషతో సిగ్గుపడుతున్నాం. నువ్వు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అన్న సంగతి మర్చిపోకు. రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం, డంప్ యార్డ్ అంశం అన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయ్. రెండున్నరెండ్లు నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. మేము కచ్చితంగా ప్రశ్నిస్తాం. మీ పరిధిలో ఉన్న అంశాన్ని మీరు తీసుకురావాలి. కరీంనగ‌ర్‌కు వస్తే అడ్డుకుంటాం అంటున్నారు.. మీ జాగీరు కాదు. బరాబర్ వస్తాం. రేవంత్ రెడ్డి, బండీ సంజయ్ ఇద్దరు తోడు దొంగలు. ఒక సోదరుడిగా చెప్తున్న ఇలాంటి భాష మాట్లాడకు. హుందాగా ఉండాలని సూచన చేస్తున్నాన‌ని గంగుల క‌మలాక‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement