Saidabad Steel Bridge | ప్రభుత్వ కట్టడాలకు అగ్రకులాల పేర్లు పెట్టడం అన్యాయం
| ఎలాంటి అర్హత లేనప్పటికీ అగ్రకులంలో పుట్టడమే అర్హతగా భావించి ప్రభుత్వ స్థలాలకు, స్టేడియాలకు, పార్కులకు, కట్టడాలకు, జిల్లాలకు, ఫ్లై ఓవర్లకు, స్కై ఓవర్లకు, స్టీల్ బ్రిడ్జిలకు వారి పేర్లు ప్రభుత్వాలు పెడుతున్నాయని, బీసీలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బీసీ కులమే అనర్హతగా భావించి బీసీల పేర్లు చారిత్రాత్మక కట్టడాలకు పెట్టడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టించే బాధ్యత వీహెచ్ తీసుకోవాలి
స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు బాధ్యత నేనే తీసుకుంటా
సీఎంను ఒప్పిస్తా... బీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టొద్దు
Saidabad Steel Bridge | త్రినేత్ర.న్యూస్ : ఎలాంటి అర్హత లేనప్పటికీ అగ్రకులంలో పుట్టడమే అర్హతగా భావించి ప్రభుత్వ స్థలాలకు, స్టేడియాలకు, పార్కులకు, కట్టడాలకు, జిల్లాలకు, ఫ్లై ఓవర్లకు, స్కై ఓవర్లకు, స్టీల్ బ్రిడ్జిలకు వారి పేర్లు ప్రభుత్వాలు పెడుతున్నాయని, బీసీలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బీసీ కులమే అనర్హతగా భావించి బీసీల పేర్లు చారిత్రాత్మక కట్టడాలకు పెట్టడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద సైదాబాద్‌లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి స్వాతంత్య్ర సమరయోధురాలు, తొలి మహిళా పార్లమెంటేరియన్ సంగం లక్ష్మీబాయి పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ టి నందగోపాల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు మద్దతుగా ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, సిరికొండ మధుసూదనాచారి, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
ముందుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విమానాశ్రయాలకు, జాతీయ పార్కులకు, జాతీయ ప్రాజెక్టులకు, సంక్షేమ పథకాలకు, క్రికెట్ స్టేడియాలకు, రహదారులకు అగ్రకుల నేతల పేర్లను పెట్టడం అనవాయితీగా మార్చుకున్నారని, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వాజ్ పేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయాలకు పెడుతున్నారని, ఇదే సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవన్, మరి చెన్నారెడ్డి టీమ్స్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, ఎన్టీఆర్ పార్క్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్, నాయి నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి, రాజిరెడ్డి ఫ్లైఓవర్ పేర్లు పెడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
బడుగు నేతల పేర్లను ఎక్కడ కూడా పెట్టకుండా అవమానిస్తున్నారని, వేలాదిమంది మహిళలకు విద్యను అందించి సొంత ఆస్తులను ట్రస్ట్‌గా మార్చి ఇందిరా సేవా సదన్ పేరుతో నిరక్ష్యరాసులకు, అభాగ్యులకు అండగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం అయినటువంటి సంగం లక్ష్మీబాయి పేరును సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని, పేరు పెట్టించే బాధ్యత ప్రభుత్వ సలహాలను బిసి శాఖకు నేతృత్వం వహిస్తున్న వి హనుమంతరావు బాధ్యత తీసుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.
సంగం లక్ష్మీబాయ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలి : ఎమ్మెల్సీ సిరికొండ
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. స్వర్గీయ ఇందిరా గాంధీ కంటే ముందే పార్లమెంటులో ప్రజా ప్రతినిధిగా అడుగుపెట్టిన తొలి మహిళ సంగం లక్ష్మి భాయ్ కావడం గర్వంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ పేరుతోనే అనేక సేవా కార్యక్రమాలు చేసి చరిత్ర సృష్టించిన గొప్ప యోధురాలు సంగం లక్ష్మి భాయ్ పేరును స్టీల్ బ్రిడ్జికి పెట్టి ఆమెకు సముచిత గౌరవాన్ని కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు స్టీల్ బ్రిడ్జితో పాటు ఆమె విగ్రహాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిరికొండ డిమాండ్ చేశారు.
లక్ష్మీబాయి పేరును స్టీల్ బ్రిడ్జికి పెట్టించే బాధ్యత నాదే : హనుమంతరావు
చివరగా ప్రభుత్వ సలహాదారులు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని, హైదరాబాద్ కు చెందిన ప్రజా ప్రతినిధులను అందర్నీ కలుపుకొని సీఎం రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి సంఘము లక్ష్మీబాయి పేరు పెట్టాల్సిన ఆవశ్యకతను వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు, బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూల వైఖరితో ఉన్నారని, ఇటీవల మాహత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను హైదరాబాదులో పెట్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు, తప్పకుండా సంఘం లక్ష్మీబాయి పేరును స్టీల్ బ్రిడ్జికి పెట్టించే బాధ్యత నాదేనని, బీసీ సంఘాలు ఎలాంటి ఆందోళన చేపట్టకుండా ప్రభుత్వానికి సహకరించాలని వి హనుమంతరావు అన్నారు
ఈ ఆందోళనలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా,బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, వినయ్ కిషోర్ యాదవ్, రావుల కోల్ నరేష్ ప్రజాపతి, బండారు యోగి, గొడుగు మహేష్ యాదవ్, శివమ్మ, గాజుల శేఖర్, వీరేందర్ యాదవ్, ఉదయనేత, పానుగంటి విజయ్, రూప, అనూష, శోభా యాదవ్, దశరథ లక్ష్మి, మాణిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Attack on Komatireddy Office | మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్లతో బీజేపీ దాడి.. ఆగ్రహంతో కాంగ్రెస్ నేతల ప్రతిదాడి
ఆగస్టు 31, 2026

Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
ఆగస్టు 31, 2026

Telangana | హైదరాబాద్.. దేశానికి గ్లోబల్ నాలెడ్జ్ హబ్!
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Attack on Komatireddy Office | మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్లతో బీజేపీ దాడి.. ఆగ్రహంతో కాంగ్రెస్ నేతల ప్రతిదాడి
- ●CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
- ●Aanasuya | జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ - కామెడీ పీస్ అంటూ నెటిజన్ల విమర్శలు
- ●Rats in Puri Temple | పూరీ జగన్నాథుడికీ తప్పని ఎలుకల బెడద.. గర్భగుడిలో పవిత్ర వస్త్రాలు ధ్వంసం, ఉచ్చు బిగించిన అధికారులు
- ●Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
- ●CM Revanth | అంబర్‌పేటలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Attack on Komatireddy Office | మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్లతో బీజేపీ దాడి.. ఆగ్రహంతో కాంగ్రెస్ నేతల ప్రతిదాడి

CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

Aanasuya | జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ - కామెడీ పీస్ అంటూ నెటిజన్ల విమర్శలు

Rats in Puri Temple | పూరీ జగన్నాథుడికీ తప్పని ఎలుకల బెడద.. గర్భగుడిలో పవిత్ర వస్త్రాలు ధ్వంసం, ఉచ్చు బిగించిన అధికారులు



