త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర : బీఆర్ఎస్ నేత దేవీ ప్ర‌సాద్‌

BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర జ‌రుగోతంద‌ని బీఆర్ఎస్ నేత దేవీ ప్ర‌సాద్ ఆరోపించారు. ప‌ల్లె ర‌వికుమార్‌, సుమిత్రానంద్‌తో క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్ప‌డింద‌న్నారు.

P

Telangana | Published On Jan 13, 2026, 5.00 pm IST

BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర : బీఆర్ఎస్ నేత దేవీ ప్ర‌సాద్‌
Advertisement

BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర జ‌రుగోతంద‌ని బీఆర్ఎస్ నేత దేవీ ప్ర‌సాద్ ఆరోపించారు. ప‌ల్లె ర‌వికుమార్‌, సుమిత్రానంద్‌తో క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్ప‌డింద‌న్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించమ‌ని చెబుతూనే రేషనైలేషన్ చేస్తామని అంటున్నార‌ని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కేసీఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశార‌ని, ఉమ్మడి జిల్లాల్లో కలెక్టర్లను ప్రజలు కలిసే పరిస్థితి ఉండేది కాద‌న్నారు. జిల్లాల సంఖ్యను మార్చకపోతే కమీషన్ ఎందుకు ? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం లేద‌ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా చేసే ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌న్నారు. జిల్లాల‌ను మార్చితే జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లోనూ మార్పులు చేయాల్సి ఉంటుంద‌ని.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోను మార్పులు చేయాల్సి ఉంటుంద‌న్నారు. దీనికి రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగుల విభజన జరిగిందని, రేవంత్ రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదపబోతున్నార‌న్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంద‌ని, ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నార‌ని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు, తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్టీఆర్ పెట్టిన మండలాలతో లాభం జరగలేదా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ చేసిన జిల్లాల మీద కడుపు మంట ఎందుకు అని ఆయ‌న నిల‌దీశారు. మారీచులు అని సీఎం అంటున్నార‌ని.. హామీలు అమలు చేస్తామంటే తాము ఏమైనా అడ్డుకున్నామా..? ఎన్నికలు ముందు దేవుళ్లులాగా మాట్లాడి ఇప్పుడు మారీచుల్లాగా మీరే మారారంటూ విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో సమస్యలపై కేటీఆర్, హరీశ్‌ రావు పోరాటం చేస్తున్నార‌న్నారు.

మా నియోజకవర్గం ఈ జిల్లాలో ఉండదు అని మంత్రి చెప్పార‌ని, జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంద‌న్నారు. మీకు ఇష్టం వచ్చినట్లు జిల్లాలు చేస్తే ఒప్పుకోమ‌న్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంద‌ని ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఎలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకువచ్చి పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల నోట్లో మ‌ట్టికొట్టింద‌ని మండిప‌డ్డారు. డీఎలు, పీఆర్సీ పై ఊసే లేదని, ఇప్పటి వరకు 140 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయార‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంద‌ని, గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ సీఎంగా 9 డీఏలు పెండింగ్‌లో పెట్టార‌ని, శిష్యుడు రేవంత్ రెడ్డి 9 డీఏలు పెండింగ్‌లో పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.

ప‌ల్లె ర‌వికుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన పేరుతో మరో కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమైంద‌ని, దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు జిల్లాల, మండలాల సరిహద్దులు మార్చకూడద‌న్నారు. ఆధిప‌త్యం కోసం మ‌ళ్లీ వికేంద్రీక‌ర‌ణ చేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కార్యాచరణ లాగా రేవంత్ రెడ్డి వైఖరి ఉంద‌న్నారు. రాచకొండ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని ప్ర‌శ్నించారు. రాచకొండ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నం, పోరాటానికి, ధిక్కారానికి గుర్తింపు లాంటిద‌న్నారు. సుమిత్రానంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేద‌న్నారు. అంతులేని సినిమాలో జయప్రద పాత్రను సీఎం రేవంత్ రెడ్డి పోషిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement