త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | పేద వర్గాలకు దైర్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్‌..: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్

BRS | రాజ్యంగ నిర్మాత డాక్ట‌ర్ అంబేద్క‌ర్ జ‌యంతి (Ambedkar Jayanti) వేడుక‌ల‌ను తెలంగాణ భ‌వ‌న్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, పార్టీ నాయ‌కులు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

G

Telangana | Published On Apr 14, 2026, 12.28 pm IST

BRS | పేద వర్గాలకు దైర్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్‌..: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ్యంగ నిర్మాత డాక్ట‌ర్ అంబేద్క‌ర్ జ‌యంతి (Ambedkar Jayanti) వేడుక‌ల‌ను తెలంగాణ భ‌వ‌న్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, పార్టీ నాయ‌కులు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాల‌న‌లో అంబేద్కర్‌కు త‌గిన గౌరవం ద‌క్క‌డం లేద‌న్నారు. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంద‌ని చెప్పారు.

తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR).. 125 అడుగుల విగ్ర‌హం పెట్టి అంబేద్కర్‌కు స‌ముచిత గౌరవం ఇచ్చారు. భవిష్యత్ తరాల నాయకుడు కేటీఆర్ అని చెప్పారు. అలాంటి వారు ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా లోతుగా పరిశీలించాల‌న్నారు. ఎస్టీ, ఎస్టీ వాడల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే అర్ధమవుతుంద‌న్నారు. గురుకుల పాఠశాలలు ఇచ్చి పేద వర్గాలకు ఒక దైర్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్‌. ఎస్సీ వర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తెచ్చార‌ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను వంచించి మోసం చేసింద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షించారు.

దేశ సంప‌ద అంబేద్క‌ర్‌: గంగుల కమలాకర్

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి సంప‌ద అని మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. ఏప్రిల్ పవిత్ర మాసమ‌ని, ఎందుకంటే అంబేద్కర్ జయంతి, బీఆర్ఎస్ ఆవిర్భావం ఇదే నెల‌లో ఉన్నాయ‌ని చెప్పారు. అంబేద్కర్ కన్న కలల‌ను బీఆర్ఎస్ పార్టీ నిజం చేస్తుంద‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యికిపైగా గురుకులాలు కేసీఆర్ ఇచ్చారన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమల‌య్యేంత వరకు కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామ‌న్నారు.

అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం: ఆర్ఎస్పీ

బీఆర్ అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం అని, రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అన్నారు. దేశం ముక్కలు చెక్కలు కాకుండా ఉందంటే అది కేవలం బాబాసాహెబ్‌ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్య‌మైంద‌ని చెప్పారు. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అనేక సార్లు చెప్పేవార‌ని గుర్తుచేశారు. దేశ చరిత్రలో అంబేద్కర్‌కు ఎవ్వ‌రూ ఇవ్వన్నంత గౌరవం తెలంగాణలో కేసీఆర్ ఇచ్చార‌న్నారు. సరిహద్దుల దాటి విదేశాల్లో తెలంగాణ బిడ్డలు చదువుకుంటున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పారు. అంబేద్కర్ మహనీయుడులా తెలంగాణ బిడ్డలు ఉండేలా వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు ఇచ్చారని వెల్ల‌డించారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నార‌ని తెలిపారు. దళితులు క్రిస్టియన్ లా మారితే వారి రిజర్వేషన్ రద్దు అవుతుందని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు అమానవీయం. హెయిట్ స్పీచ్ బిల్లుతో తెలంగాణలో మనిషి హక్కులను కాలరాసే బిల్లు తెచ్చేందుకు సిద్ధమయ్యారు.

 

Advertisement
Advertisement