త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | క‌రీంన‌గ‌ర్‌లో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు.. గంగుల క‌మ‌లాక‌ర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి..

BJP | కరీంనగర్‌లో (Karimnagar) బీజేపీ (BJP) గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్ధాలు పగులగొట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్ప‌డ్డారు.

G

Telangana | Published On May 7, 2026, 1.29 pm IST

BJP | క‌రీంన‌గ‌ర్‌లో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు.. గంగుల క‌మ‌లాక‌ర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి..
Advertisement

BJP | త్రినేత్ర‌.న్యూస్‌: కరీంనగర్‌లో (Karimnagar) బీజేపీ (BJP) గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్ధాలు పగులగొట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్ప‌డ్డారు. కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై కూడా దాడికి యత్నించారు. పోలీసుల సమ‌క్షంలోనే దాడికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

అస‌లేం జ‌రిగిందంటే..

మూడు రోజుల క్రితం రెవంత్, కేటీఆర్ కుమ్మక్కు అయ్యారని, అందుకే కాళేశ్వరం సహా ఏ కేసులు కూడా ముందుకు కదలడం లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో తమకు తెలుసని చెప్పారు. చాలా విషయాలు తమ వద్ద ఉన్నాయని సమయం వచ్చినప్పుడు అన్నింటినీ బయటపెడతామన్నారు. ఎవరికి ఎవరు సహాయ మంత్రిగా ఉన్నారో తేలుస్తామని చెప్పారు. కచ్చితంగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు.

ప్ర‌తిగా కేటీఆర్‌పై బండి సంజ‌య్‌ తీవ్ర పదజాలంతో దూషించారు. కరీంనగర్‌లో కేటీఆర్ ఎలా తిరుగుతాడో చూస్తామంటూ స‌వాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణల‌కు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.

తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్న బండి సంజయ్: పాడి కౌశిక్ రెడ్డి

దీనికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నందుకే సైడ్ ఎఫెక్ట్ అయి వెంట్రుకలు ఊడిపోయి గుండు అయింద‌ని విమ‌ర్శించారు. ఆయ‌న‌కు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. తంబాకు, డ్రగ్స్ తినే అలవాటులో బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతున్న స‌మ‌యంలోనే విధ్వంసం సృష్టించారు.

ఈ దాడులపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీజేపీ, కాంగ్రెస్ కలిపి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేపైనే ఈ స్థాయిలో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తనను చంపేందుకు ఇప్పటికే రెక్కీ నిర్వహించారని ఇదే విషయాన్ని ఉదయం పెట్టిన ప్రెస్ మీట్‌లో చెప్పానని అన్నారు. అదే ఇప్పుడు కనిపించిందన్నారు. తనను చంపేందుకు కత్తులు, బాంబులు, రాడ్లతో వచ్చారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని చెప్పడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే ఉదాహరణ అని అన్నారు. దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలన్నారు. వారిని వెంటనే రిమాండ్‌కు తరలించాలని అన్నారు. తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని అన్నారు. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము రియాక్ట్ అయ్యామని అన్నారు.

Advertisement
Advertisement