త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP MPs | రైల్వే ఓవ‌ర్, అండ‌ర్ బ్రిడ్జిల‌ను పూర్తి చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు

BJP MPs | కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ప‌లు అంశాలు తీసుకువ‌చ్చారు.

S

Telangana | Published On Jul 30, 2026, 7.24 pm IST

BJP MPs | రైల్వే ఓవ‌ర్, అండ‌ర్ బ్రిడ్జిల‌ను పూర్తి చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు
Advertisement

BJP MPs | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ప‌లు అంశాలు తీసుకువ‌చ్చారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు అవసరం ఉంది. ఇప్పటికి మంజూరు అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు త్వ‌ర‌గా పూర్తిచేయాలని కోరారు. ఇంకా చాలా అవసరం ఉన్నాయి.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.. వాటిని కూడా మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో గతంలో కంటే రైళ్ల వేగం, రైళ్ల ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. అది గమనించక చాలా మంది ప్రజలు పట్టాలు క్రాస్ చేస్తూ రైలు ప్ర‌మాదాల్లో చనిపోతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం అని మంత్రి దృష్టికి ఈటల రాజేందర్ తీసుకువచ్చారు. ఇందుకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు.

అవసరం ఉన్న ప్రతి చోట చిన్న చిన్న అండర్ పాస్‌లు.. 9 - 10 అడుగుల ఎత్తులో సాధ్యమైనంత ఎక్కువ వెడల్పుతో నిర్మించాలని కోరారు. ఆటోలు, స్కూటర్లు, మనుషులు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని సూచించారు. పట్టాలు తక్కువ ఎత్తులో ఉన్న చోట మనుషులు క్రాస్ చేయడానికి అనువుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జులు నిర్మాణం చేయాలని కోరారు. ప్ర‌మాదం జరగకుండా చూడడమే మనందరి అంతిమ లక్ష్యంగా ఉండాలని కోరారు. ఎంతో ఖర్చు పెట్టి రైల్వే అండర్ బ్రిడ్జిలు కట్టినా.. చాలాచోట్ల వాటికి ఇరువైపులా మూడు నుండి నాలుగు అడుగుల నీరు, వర్షాకాలంలో నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలు జరగక నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.

Advertisement
Advertisement