త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Arvind | కేసీఆర్‌ను తిట్టించేందుకే.. క‌విత‌తో సీఎం రేవంత్ పార్టీ పెట్టించారు : ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్

Dharmapuri Arvind | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను తిట్టించేందుకే క‌విత‌తో సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెట్టించార‌ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌విత పార్టీ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఇన్‌డైరెక్ట్‌గా బీజేపీకే బెనిఫిట్ జ‌రుగుతుంద‌ని అర‌వింద్ అన్నారు.

S

Telangana | Published On May 2, 2026, 5.11 pm IST

Dharmapuri Arvind | కేసీఆర్‌ను తిట్టించేందుకే.. క‌విత‌తో సీఎం రేవంత్ పార్టీ పెట్టించారు : ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్
Advertisement

Dharmapuri Arvind | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను తిట్టించేందుకే క‌విత‌తో సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెట్టించార‌ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌విత పార్టీ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఇన్‌డైరెక్ట్‌గా బీజేపీకే బెనిఫిట్ జ‌రుగుతుంద‌ని అర‌వింద్ అన్నారు. కామారెడ్డిలో ధ‌ర్మ‌పురి అర‌వింద్ శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ముగిశాయి. అందులో బెంగాల్ రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాత బీజేపీయేతర పార్టీల‌కు వెన్నుపూస‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. బెంగాల్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది. కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోయారు. కేసీఆర్, రేవంత్‌తో పాటు రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌కు డెఫినెట్‌గా వ‌ణుకు మొద‌ల‌వుతుంది అని ఎంపీ పేర్కొన్నారు.

అపోజిష‌న్ పార్టీల్లో హాట్ చ‌ర్చ‌

నాలుగో తారీఖు త‌ర్వాత ఐదారు రోజులు అగ్ర నాయ‌క‌త్వం బిజీగా ఉంటుంది. ప‌రేడ్ గ్రౌండ్‌లో మోదీ స‌భ 10న ఉంది. 4 ల‌క్ష‌ల మంది త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ స‌భ‌ అపోజిష‌న్ పార్టీల్లో హాట్ చ‌ర్చ‌గా మారింది. ఇది ప‌క్కా పొలిటిక‌ల్ స‌భ‌. ప్ర‌ధాని మోదీ దాదాపు రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేస్తారు. అనంత‌రం స‌భ ఉంటుంది అని ఎంపీ అర‌వింద్ అన్నారు.

మ‌హిళ‌ల‌కు ఏ పార్టీ వ్య‌తిరేక‌మ‌నేది బ‌ట్ట‌బ‌య‌లైంది..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు 17వ లోక్‌స‌భ‌లోనే పాస్ చేసుకున్నాం. ఈ బిల్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమ‌లు కావ‌డం ఖాయం. బీజేపీ పార్టీ చిత్త‌శుద్ధితో ఉంది. మ‌హిళ‌ల‌కు ఏ పార్టీ వ్య‌తిరేక‌మ‌నేది దేశ వ్యాప్తంగా బ‌ట్ట‌బ‌య‌లైంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మ‌హిళ‌లు ఆ పార్టీల‌కు బుద్ది చెబుతారు అని ఎంపీ పేర్కొన్నారు.

ఈ స‌భ 2028 ఎన్నిక‌ల‌కు నాంది

వ‌రంగ‌ల్‌లో వ్యాగ‌న్ ఫ్యాక్ట‌రీ ప్రారంభానికి ఉంది. వేల కోట్ల రూపాయాల అభివృద్ధి తెలంగాణ‌లో జ‌రిగింది. హైవేలు, రైల్వే స్టేష‌న్ల అభివృద్ధికి కేటాయించారు. మోదీకి తెలంగాణ‌పై అమిత‌మైన ప్రేమాభిమానం ఉంది. ఎంత‌సేపు ఏం ఇచ్చార‌ని రేవంత్, కేసీఆర్ బుర‌ద‌జ‌ల్లుతున్నారు. 2019 నుంచి తెలంగాణ‌కు రూపాయికి 87 పైస‌లు వాప‌స్ వ‌చ్చాయి. కేవ‌లం రాజ‌కీయ‌ మ‌నుగ‌డ కోసం ఏదో బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మోదీ, బీజేపీ మీద తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అమిత‌మైన విశ్వాసం ఉంది. ఈ స‌భ 2028 ఎన్నిక‌ల‌కు నాందిగా ఉండ‌బోతుంది అని ధ‌ర్మ‌పురి అరవింద్ తెలిపారు.

మ‌మ‌త‌ను ఓడించ‌డం అనేది డిఫ‌రెంట్ లెవ‌ల్..

మ‌మ‌తా బెన‌ర్జీ జీవిత రాజ‌కీయ ప్ర‌యాణం చూస్తే.. ఒక ఫైట‌ర్‌గా, క‌మ్యూనిస్టుల‌తో కొట్లాడి, కాంగ్రెస్‌తో విడిపోయి బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. అలాంటి నేత‌ను ఓడించి బెంగాల్‌లో పాగా వేస్తున్నాం. దేశం మొత్తం బీజేపీ గెలుస్తుంది. మ‌మ‌త‌ను ఓడించ‌డం అనేది డిఫ‌రెంట్ లెవ‌ల్. అది కూడా మేం ఫుల్ ఫిల్ చేసుకుని, ఫ‌స్ట్ తెలంగాణ‌కు రావ‌డం అనేది.. ఇది 2028 ఎన్నిక‌ల‌కు పొలిటిక‌ల్ స్టేట్‌మెంట్ అని ఎంపీ అన్నారు.

ఈవీఎంలు హ్యాక్ చేసేది అసంభ‌వం..

ఈవీఎంలు హ్యాక్ చేసేది అసంభ‌వం. ఎవ‌రు ఏమీ చేయ‌లేరు. ప్ర‌పంచ స్థాయిలో అధ్య‌య‌నం జ‌రిగిపోయింది.. ట్యాంప‌రింగ్ చేసే అవ‌కాశం లేదు. అట్ల అంటే కేర‌ళ‌, త‌మిళ‌నాడు గెలిచేటోళ్లం క‌దా.. ఓడిపోతే మంచివి కాదు.. గెలిస్తే మంచివా.. రాబోయే బీజేపీ ప్ర‌భుత్వంలో తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాలు ఉమ్మ‌డి నిజామాబాద్ నుంచే అధికంగా వ‌స్తాయని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ దీమా వ్య‌క్తం చేశారు.

 

Advertisement
Advertisement