Dharmapuri Arvind | ఎవరు.. ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెల్వదా..? : ఎంపీ ధర్మపురి అరవింద్
Dharmapuri Arvind | బీఆర్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. భవిష్యత్‌లో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Dharmapuri Arvind | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. భవిష్యత్‌లో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తీవ్రంగా స్పందించారు.
ఎవరు భూస్థాపితం అయ్యారు.. ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారు..? ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితం అయ్యారు మీకు తెల్వదా..? మాకు తెల్వదా..? ఆమెకు తెల్వదా..? మహిళ.. మా జిల్లా కోడలు.. గాడ్ బ్లెస్ అనాలి అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
నార్త్ తెలంగాణలో బ్రహ్మాండంగా బీజేపీ డామినేట్ చేసింది. సౌత్ తెలంగాణలో ఇంకొంత ఇంప్రూవ్ చేయాలి. ఇవాళ నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు సపోర్టు చేసింది. బీజేపీ ఎదగొద్దు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. వీళ్లు చేశారు.. వాళ్లు చేయించుకున్నారు. వీరి కేసులను వందకు వంద శాతం కాంగ్రెసోళ్లు కాపాడుతున్నారు. ఎన్నికలు అయిపోయాక ఏ పార్టీలో ఉన్న నేత అయినా సరే.. పరిపానలను సక్రమంగా నడపాలి. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక.. నేతలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఎక్కడా కూడా కుటుంబ అవినీతిపై మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ఎవరూ ప్రశ్నించొద్దని. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు. మేం వ్యవస్థను శుద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. నా ప్రాంత ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు. కొద్దిగా మిస్ అయ్యాం. ఇంకో రెండు చోట్ల గెలిస్తే మాకే అవకాశం వచ్చేది. మేయర్ పదవిలో కూర్చోగానే మాకేం కిరీటం రాదు. ఒక ఐడియాలజీ ప్రకారం పని చేస్తున్నాం అని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



