త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | పేద‌ల‌పై కాంగ్రెస్ దాడిని చ‌రిత్ర ఎప్ప‌టికీ మ‌రిచిపోదు : రామ‌చంద‌ర్ రావు

Ramchander Rao | రాష్ట్రంలో పేద‌ల‌పై కాంగ్రెస్ స‌ర్కార్ కొన‌సాగిస్తున్న దాడిని చ‌రిత్ర ఎప్ప‌టికీ మ‌రిచిపోదు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On Feb 23, 2026, 4.54 pm IST

Ramchander Rao | పేద‌ల‌పై కాంగ్రెస్ దాడిని చ‌రిత్ర ఎప్ప‌టికీ మ‌రిచిపోదు : రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో పేద‌ల‌పై కాంగ్రెస్ స‌ర్కార్ కొన‌సాగిస్తున్న దాడిని చ‌రిత్ర ఎప్ప‌టికీ మ‌రిచిపోదు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు. హైడ్రా పేరిట ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యాయి. ఇప్పుడు ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ పేరుతో సుమారు 450 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి, తరలించే ప్రయత్నం జరుగుతోంది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అభివృద్ధి పేరుతో పేదల జీవితాలను అంధకారంలోకి నెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా చట్టబద్ధమైన విధానాలు, గౌరవప్రదమైన పునరావాసం, పూర్తి పారదర్శకత తప్పనిసరిగా కల్పించాలి. తగిన భద్రత లేకుండా, బలవంతంగా పేదలను ఖాళీ చేయించడం మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రభావిత ప్రతి కుటుంబం పక్షాన మేము దృఢంగా నిలుస్తాం. ప్రతి కుటుంబానికి న్యాయం, పారదర్శకత, సముచిత పునరావాసం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement