త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | రేవంతుద్దీన్, అక్బ‌రుద్దీన్ తోడు దొంగ‌లే..

Ramachander Rao | రాష్ట్ర సీఎం రేవంతుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే అని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ క‌లిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Feb 27, 2026, 4.14 pm IST

Ramachander Rao | రేవంతుద్దీన్, అక్బ‌రుద్దీన్ తోడు దొంగ‌లే..
Advertisement

జీహెచ్ఎంసీలో బీజేపీని ఓడించేందుకు య‌త్నం..
హైద‌రాబాద్‌ను క‌బ్జా చేసేందుకు నాట‌కం..
కేజ్రీవాల్, క‌విత త‌ప్పు చేయ‌లేద‌ని కాదు..
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై బీజేపీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర సీఎం రేవంతుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే అని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ క‌లిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కోరుట్ల నియోజ‌కవ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ అనూప్ రావు బీజేపీలో పార్టీలో చేరిన సంద‌ర్భంగా రామ‌చంద‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌లో మేధావులు, విద్యావంతులు బీజేపీలో చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ప‌ని తీరుపై, పార్టీ సిద్ధాంతంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరుగుతుంది. ఈ క్ర‌మంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నారు. ఆ స‌ర‌ళి కూడా తెలంగాణ‌లో మొద‌లైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున యువ‌కులు బీజేపీలో చేరారని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

రేవంతుద్దీన్, అక్బ‌రుద్దీన్ మంచి దోస్తులు, వారిద్ద‌రూ ఎల‌ప్పూడు క‌లిసే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా అక్బ‌రుద్దీన్ ఎప్పుడూ కూడా మాట్లాడ‌రు. హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌జ్లిస్ పార్టీకి కాంగ్రెస్ కొమ్ముకాస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం క‌లిసి బీజేపీని ఓడించే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. యూపీ సీఎం యోగి, సీఎం రేవంత్ ఒక్క‌టే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించ‌డం స‌రికాదు. హైడ్రా పేరుతో, గాంధీ స‌రోవ‌ర్ పేరిట‌ బీద‌ల ఇండ్లు కూల‌గొడుతున్నారు రేవంత్ రెడ్డి. అక్బ‌రుద్దీన్ ఇల్లు, స్కూల్, కాలేజీ కూల‌గొట్టారా..? దాని గురించి మాట్లాడారు. ఇద్ద‌రు కూడా తోడు దొంగ‌లే. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను మాయ చేస్తున్నారు. వారిద్ద‌రి దోస్తీ విడ‌వ‌దు. హైద‌రాబాద్‌ను క‌బ్జా చేసేందుకు నాట‌క‌మాడుతున్నారు అని రామ‌చంద‌ర్ రావు నిప్పులు చెరిగారు.

ఇక సాంకేతిక అంశాల‌పై అరవింద్ కేజ్రీవాల్, క‌విత డిశ్చార్జ్ అయితే వాళ్లు త‌ప్పు చేయ‌లేద‌ని కాదు. చంక‌లు గుద్దుకోవాల్సిన అవ‌స‌రం లేదు. సీబీఐ అప్పీల్‌కు వెళ్లొచ్చు. ఈ కేసులో క‌విత నిర్దోషి అయితే.. సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు ఎందుకు కాల‌బెట్టారు. ముందుంది మొస‌ళ్ల పండుగ అని రామ‌చంద‌ర్ రావు విమ‌ర్శించారు.

Advertisement
Advertisement