త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Power Demand | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పెరిగే విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jul 18, 2026, 10.05 pm IST

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Advertisement

Power Demand | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పెరిగే విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని టీజీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యుత్ సంస్థలు, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్థిక క్రమశిక్షణ పెంచాలని..

ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూళ్లను వేగవంతం చేసి సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచాలని భట్టి సూచించారు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్‌ను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఫీడర్-డీటీఆర్-వినియోగదారుల మ్యాపింగ్ ద్వారా అంతరాయాలను వెంటనే గుర్తించి సరఫరా పునరుద్ధరించే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు దశలవారీగా సౌర విద్యుత్ సదుపాయం కల్పించాలని, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మోడల్ సబ్‌స్టేషన్ తరహాలో అన్ని సబ్‌స్టేషన్లను ఆధునికీకరించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో భూమి కొరత ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటుపై మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 'పవర్ అంబులెన్స్' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కొత్త బొగ్గు బ్లాక్‌లు సాధించాలి

పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి కొత్త బొగ్గు బ్లాక్‌లు సాధించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. తాడిచర్ల-2 బ్లాక్‌కు అవసరమైన అన్ని అనుమతులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, గ్రేడ్ పరిరక్షణ, విద్యుత్ కేంద్రాలకు సకాలంలో సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని గుర్తుచేసిన ఆయన, కోయగూడెం-3, సత్తుపల్లి-2 బొగ్గు బ్లాక్‌లను తిరిగి సింగరేణికి దక్కేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement