Azharuddin | అజారుద్దీన్ మంత్రి పదవి ఊడటం ఖాయమేనా?.. ఇంకా నిర్ణయం తీసుకోని గవర్నర్..
Azharuddin | ఉప ఎన్నికల కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు (Azharuddin) కొత్త టెన్షన్ పట్టుకున్నది. మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు కావస్తున్నా ఏ సభలోనూ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో పదవి పోగొట్టుకున్న మంత్రిగా పేరొస్తుందేమోనని ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నది.
Azharuddin | త్రినేత్ర.న్యూస్: ఉప ఎన్నికల కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు (Azharuddin) కొత్త టెన్షన్ పట్టుకున్నది. మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు కావస్తున్నా ఏ సభలోనూ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో పదవి పోగొట్టుకున్న వ్యక్తిగా పేరొస్తుందేమోనని ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎన్నికల్లో గెలవడానికి మంత్రి పదవైతే ఇచ్చారు.. కానీ, దానిని నిలబెట్టుకునేందుకు మార్గం లేకుండా పోవడంతో అడకత్తెరలో పోకచెక్కలా ఆయన పరిస్థితి మారిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubileehills By Election) తననే గెలిపించి, ఆ తర్వాత మంత్రిని చేస్తే అయిపోతుండే కదా అని మదనపడేలా చేస్తున్నది. ఎమ్మెల్సీగా (Governor Quota MLC) ఎన్నికయ్యే అవకాశం లేనప్పటికీ సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయంతో ఎన్నికల్లో తనను పావుగా వాడుకున్నారని అజారుద్దీన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందో? ఊడుతుందో త్వరలోనే తేలిపోనుంది. అయితే ఆయన మంత్రి పదవి కోల్పోవడం ఖయమని విపక్షాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ నియామకంపై ఏదోఒకటి తేల్చాలని సీఎం రేవంత్ కోరినప్పటికీ గవర్నర్ పట్టించుకోకపోవడమే దీనికి కారణం.
సర్వత్రా ఆసక్తి..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్లను సిఫారసు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. కానీ దానిపై గవర్నర్ ఇప్పటికీ ఆమోదముద్ర వేయడం లేదు. దీంతో మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ పదవి నిలబడాలంటే.. ఈనెల 30 వరకే సమయం ఉంది. గత ఆదివారం సీఎం రేవంత్ స్వయంగా గవర్నర్ కలిసి అజారుద్దీన్ వ్యవహారంపై తేల్చాలని కోరినప్పటికీ.. ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్సీల నియామకం విషయంలో తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కోర్టు చెప్పినా..
బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే దాన్ని నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించగా.. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త వారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కొత్తగా కోదండరాం, ఆజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించగా ఆ ఫైల్ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీల నియామకానికి తమ తీర్పు అడ్డుకాదని, నియామకాలు చేపట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోకవడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



