త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అధికారులంతా సిద్ధంగా ఉండండి.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌క్ష‌ణ‌మే స్పందించండి

Ponguleti Srinivas Reddy | వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని.. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హౌసింగ్, సమాచార- పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ‌ ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింద‌న్నారు.

S

Telangana | Published On Jul 30, 2026, 4.46 pm IST

Ponguleti Srinivas Reddy | అధికారులంతా సిద్ధంగా ఉండండి.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌క్ష‌ణ‌మే స్పందించండి
Advertisement
  • కొన్ని జిల్లాలకు రెడ్ అల‌ర్ట్ జారీ అయింది
  • ప్రమాదకర ప్రాంతాల‌ ప్రజలను అప్రమత్తం చేయండి
  • ఇబ్బందులుంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
  • టెలికాన్ఫ‌రెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆదేశం

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని.. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హౌసింగ్, సమాచార- పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ‌ ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింద‌న్నారు. రాబోయే రెండు రోజుల్లో కురిసే వర్షాల‌పై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో గురువారం ఆయ‌న‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల జారీ చేసింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో స‌మ‌న్వ‌యం చేసుకొని నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలి అని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించాల‌ని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా (హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోలి అని మంత్రి పొంగులేటి సూచించారు.

రాష్ట్రంలో 30% మేర ఉన్న వర్షపాతం లోటు, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భర్తీ అయి దాదాపు సాధారణ స్థాయికి చేరుకుంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశామ‌ని తెలిపారు.

Advertisement
Advertisement