Agri Show | ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో ప్రారంభం
Agri Show | హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో -2026 కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు.
Agri Show | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో -2026 కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాశం రాంరెడ్డి, రైతుబడి రాజేందర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉంది. రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారు. తాను బ్రతకాలి , తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుంది. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు. సరైనా పద్దతిలో చేస్తే లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది. యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా నాకు ఆత్మీయులు. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారు. నేను కూడా రైతుబడి ఛానల్‌లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




