Agri Expo | హైదరాబాద్‌లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం
Agri Expo | ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
ఎన్టీఆర్ స్టేడియం కేంద్రంగా రైతుల పండుగ
లక్ష మంది రైతులు పాల్గొంటారని అంచనా
Agri Expo | త్రినేత్ర.న్యూస్ : ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500లకు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయని.. మూడు రోజుల్లో పలు అంశాలపై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని.. అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావొచ్చని తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




