Bhujangarao | మాజీ ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు
Bhujangarao | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నిందితుడు, మాజీ ఏఎస్పీ భుజంగరావు (Bhujangarao) నివాసాల్లో ఏసీబీ సోదాలు (ACBI Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్, సూర్యాపేట మొత్తం సహా 15 ప్రాంతాల్లోని నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Bhujangarao | త్రినేత్ర.న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నిందితుడు, మాజీ ఏఎస్పీ భుజంగరావు (Bhujangarao) నివాసాల్లో ఏసీబీ సోదాలు (ACBI Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్, సూర్యాపేట మొత్తం సహా 15 ప్రాంతాల్లోని నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హఫీజ్‌పేటలోని భుజంగరావు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో భుజంగరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు
గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఈ నెల 1న సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తాము సేకరించిన సాంకేతిక సాక్ష్యాలను ఎమ్మెల్యేల ముందు ఉంచి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
గతంలో వీరికి నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపి వారిని పిలిపించారు. ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





