త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA KP Vivekananda | 250 ఎకరాల మెట్రో భూములు కాజేసేందుకు సీఎం య‌త్నం: ఎమ్మెల్యే కె .పి. వివేకానంద

MLA KP Vivekananda | మెట్రో(Metro) కు చెందిన 250 ఎక‌రాల భూముల‌(Lands) ను కాజేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivekananda) ఆరోపించారు. సీఎం రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Apr 3, 2026, 3.22 pm IST

MLA KP Vivekananda | 250 ఎకరాల మెట్రో భూములు కాజేసేందుకు సీఎం య‌త్నం: ఎమ్మెల్యే కె .పి. వివేకానంద
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మెట్రో(Metro) కు చెందిన 250 ఎక‌రాల భూముల‌(Lands) ను కాజేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivekananda) ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో సీఎం మొదటి నుంచి తప్పుడు దారిలో వెళ్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌(Telangana Bhavan)లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని విమ‌ర్శించారు.

త‌న అనుచ‌రుల‌కు ప్ర‌భుత్వ ఆస్తులు..

మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, HCU భూములు , హిల్ట్ పాలసీ, TDR తో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తన అనుచరులకు కట్టబెడుతూ తన ఆస్తులను పెంచుకున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి హైదరాబాద్ నడి బొడ్డున 250 ఎకరాలను కొల్లగొట్టేందుకు రేవంత్ సిద్ధమయ్యాడని ఫైర‌య్యారు. తాము అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శాంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను ఇప్ప‌టికే పూర్తి చేసేవాళ్ల‌మ‌ని చెప్పారు. ఉత్త‌ర దిక్కు మేడ్చల్ వైపు సైతం మెట్రో ప‌నులు చేసేవాళ్ల‌మ‌ని తెలిపారు.

ఏనాడూ కేంద్ర మంత్రితో మాట్లాడ‌లే..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ మెట్రో స్వాధీనంపై స్టేట్ మెంట్ ఇచ్చి ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయంతో చేస్తామని చెప్పి సభను నుంచి వెళ్లిపోయాడు. గ‌త రెండేళ్లుగా దొంగసాటుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింది. మెట్రో రైలు కుంటుపడిపోయింది, రెండేళ్లుగా పనులు జరిగితే ఎయిర్ పోర్ట్ సౌకర్యం పెరిగేది. 70 సార్లు ఢిల్లీ పోయిన రేవంత్ హైదరాబాద్ మెట్రో విషయంలో ఏనాడు కేంద్ర మంత్రితో మాట్లాడలేదు. మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ, హైదరాబాద్ ప్రజలపై ఉంది.

కిష‌న్‌రెడ్డి, రేవంత్ రెడ్డి ఒక్క‌టే..

రాష్ట్రానికి పనికిరాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటే, రెండో వరుసలో బండి సంజయ్ ఉంటాడు. విభజన చట్టంలో న్యాయంగా రావాల్సినవే ఇంతవరకు రాలేదు. తెలంగాణ నుంచి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ లేదు. రాష్ట్రం నుంచి ఉన్న‌ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉప్పు, కారం తినడం లేదా? అలంకారంగానే కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్క ఎయిర్ పోర్ట్ తెలంగాణకు తేలేకపోతున్నారు. తెలంగాణ సోయి ఉన్నోడు కేంద్రంలో ఒక్కడు లేడు. తెలంగాణకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి పని చేస్తున్నాడు, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకటే అని నిప్పులు చెరిగారు.

సీపీఎం నాయ‌కులు స్పందించాలి..

తెలంగాణ కోసం రాజీనామా చేయ‌ని కిషన్ రెడ్డిని అంబర్ పేటలో ప్ర‌జ‌లు ఓడించార‌న్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పై తెలంగాణలో ఉండే CPM నాయకులు తప్పకుండా స్పందించాలని కోరారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయో లేదో CPM, CPI నాయకులు అడిగితే తెలుస్తుంద‌న్నారు. రేవంత్ రెడ్డి వచ్చిరాని ఇంగ్లీష్ తో కేరళలో మాట్లాడుతుంటే కేరళ ప్రజలు నవ్వుకున్నార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ATM గా మారిందని.. ఇక్కడ దోచుకున్న డబ్బుల‌ను ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని కాంగ్రెస్‌పై వివేకానంద‌ విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

Advertisement
Advertisement