త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Intensive Revision Telangana | తెలంగాణ ఎస్ఐఆర్ : 73 లక్షల మంది లిస్ట్ నుంచి ఔట్.. టాప్‌లో యాదాద్రి, లాస్ట్‌లో హైదరాబాద్

తెలంగాణలో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ముగిసింది. ఏకంగా 73 లక్షల ఓట్లను అధికారులు తొలగించారు. ముసాయిదా, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రానుందంటే?

J

Telangana | Published On Aug 10, 2026, 8.10 pm IST

Special Intensive Revision Telangana | తెలంగాణ ఎస్ఐఆర్ : 73 లక్షల మంది లిస్ట్ నుంచి ఔట్.. టాప్‌లో యాదాద్రి, లాస్ట్‌లో హైదరాబాద్
Advertisement
  • తెలంగాణలో పూర్తయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ
  • రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తింపు.. 73.95 లక్షల ఓట్ల తొలగింపు
  • డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి (94.30%) టాప్ కాగా, హైదరాబాద్ (58.58%) లాస్ట్
  • ఈ నెల 17న ముసాయిదా జాబితా
  • అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల

Special Intensive Revision Telangana | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ తాజాగా ముగిసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. దీంతో తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్యపై ఒక క్లారిటీ వచ్చింది. త్వరలోనే తుది జాబితాను (Final list) విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది.

కోట్లలో ఓటర్లు.. లక్షల్లో గల్లంతు

తాజా ఎన్యూమరేషన్ డేటా ప్రకారం.. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, వలస వెళ్లినవారు, మరణించిన వారి వివరాలను పక్కాగా ఫిల్టర్ చేసి, సుమారు 73,95,954 మంది ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారు. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ (Digitalization) ప్రక్రియ పూర్తయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఓవరాల్‌గా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలే టాప్.. సిటీలో డల్

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆ తర్వాత మెదక్ (90.54%), సూర్యాపేట (90.43%) జిల్లాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ఆ తర్వాత జగిత్యాల (89.60%), కుమురం భీమ్ ఆసిఫాబాద్ (89.45%) నిలిచాయి.

అయితే, ఐటీ హబ్‌గా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం డిజిటలైజేషన్ ఆశించిన స్థాయిలో జరగలేదు. గడువును రెండు సార్లు పొడిగించినప్పటికీ.. హైదరాబాద్ జిల్లా 27,74,687 ఫారాలతో (58.58%) అట్టడుగు స్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 63.82 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.91 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. అర్బన్ ఏరియాల్లో అధికారుల ఉదాసీనతతో పాటు ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడమే ఈ స్లో ప్రాసెస్‌కు కారణమని తెలుస్తోంది.

ముసాయిదా, ఫైనల్ లిస్ట్ (Draft & Final Roll) ఎప్పుడంటే?

ఈ నెల 12న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనంతరం, ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితాను (Draft voter list) రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత సరిగ్గా నెల రోజుల పాటు ప్రజల నుంచి మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చిన అప్లికేషన్లన్నింటినీ పరిష్కరించిన అనంతరం, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. మీరు కూడా మీ ఓటు ఉందో లేదో ముసాయిదా జాబితా రాగానే ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.

Advertisement
Advertisement