త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Compact Smart Phones | పాకెట్ల‌లో సుల‌భంగా ఇమిడిపోతాయి.. చిన్న సైజులో ఉన్నా ఈ ఫోన్లు ప‌నితీరులో భేష్‌..

Compact Smart Phones | స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు పెద్ద డిస్‌ప్లేలు, భారీ పరిమాణం ఉన్న ఫోన్లకు అధిక డిమాండ్‌ ఉండగా.. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చేతిలో సులభంగా పట్టుకునేలా, జేబులో ఇట్టే ఇమిడిపోయేలా ఉండే కాంపాక్ట్‌ స్మార్ట్‌ఫోన్ల వైపు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

S

Technology | Published On Jun 8, 2026, 12.02 pm IST

Compact Smart Phones | పాకెట్ల‌లో సుల‌భంగా ఇమిడిపోతాయి.. చిన్న సైజులో ఉన్నా ఈ ఫోన్లు ప‌నితీరులో భేష్‌..
Advertisement

Compact Smart Phones | స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు పెద్ద డిస్‌ప్లేలు, భారీ పరిమాణం ఉన్న ఫోన్లకు అధిక డిమాండ్‌ ఉండగా.. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చేతిలో సులభంగా పట్టుకునేలా, జేబులో ఇట్టే ఇమిడిపోయేలా ఉండే కాంపాక్ట్‌ స్మార్ట్‌ఫోన్ల వైపు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా 6.3 ఇంచుల కంటే తక్కువ లేదా సమాన పరిమాణంలో డిస్‌ప్లే కలిగిన ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మారుతున్న ట్రెండ్‌ను గుర్తించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు కూడా చిన్న పరిమాణంలోనే అధునాతన ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. కాంపాక్ట్‌ ఫోన్‌ల విభాగంలో యాపిల్‌ నుంచి అందుబాటులో ఉన్న చిన్న మోడల్ ఐఫోన్ 17ఇ. 6.1 ఇంచుల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో ఏ19 చిప్‌సెట్‌ను అందించారు. ఫోటోగ్రఫీ కోసం 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 256జీబీ వేరియంట్‌ ధర రూ.64,900 కాగా, 512జీబీ మోడల్‌ ధర రూ.84,900గా ఉంది.

ఐఫోన్ 17..

వివో సంస్థ ఇటీవల విడుదల చేసిన వివో ఎక్స్‌300 ఎఫ్ఈ కూడా కాంపాక్ట్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. 6.31 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. 50ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 50ఎంపీ టెలిఫోటో, 8ఎంపీ అల్ట్రావైడ్‌, 50ఎంపీ సెల్ఫీ కెమెరాలను అందించారు. 6500ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్‌ నుంచి మరో కాంపాక్ట్‌ ఎంపికగా ఐఫోన్ 17 అందుబాటులో ఉంది. 6.3 ఇంచుల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, ఏ19 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్‌లో 48ఎంపీ ప్రధాన కెమెరా, 40ఎంపీ అల్ట్రావైడ్‌, 18ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. 256జీబీ వేరియంట్‌ ధర రూ.82,900 కాగా, 512జీబీ వేరియంట్‌ ధర రూ.1,02,900గా ఉంది.

గూగుల్ పిక్స‌ల్ 9ఎ..

గూగుల్‌ అభిమానుల కోసం గూగుల్ పిక్సెల్ 9ఎ మంచి ఎంపికగా నిలుస్తోంది. 6.3 ఇంచుల డిస్‌ప్లే, టెన్సర్‌ జీ4 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 48ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ అల్ట్రావైడ్‌, 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5100ఎంఏహెచ్‌ బ్యాటరీ, 23 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ అందించారు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.49,999గా ఉంది. ఇక ఒప్పో నుంచి రెనో 15 ప్రొ మినీ 5జి కూడా కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో ఆకట్టుకుంటోంది. 6.32 ఇంచుల 1.5కె ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 200ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్‌, 50ఎంపీ పెరిస్కోప్‌, 50ఎంపీ సెల్ఫీ కెమెరాలను అందించారు. 6200ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కూడిన ఈ ఫోన్‌ 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. పెద్ద ఫోన్లకు ప్రత్యామ్నాయంగా పనితీరు, కెమెరా, బ్యాటరీ సామర్థ్యంలో రాజీ పడకుండా కాంపాక్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తోంది.

Advertisement
Advertisement