త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Redmi Note 17 Pro | 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్లు. ధర ఎంతంటే..

Redmi Note 17 Pro | షియోమీ తన ఎగువ మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ 5జితో పాటు ఈ సిరీస్‌లో తొలిసారిగా టాప్‌-టియర్‌ వేరియంట్‌గా రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ మ్యాక్స్ 5జిని కూడా తీసుకొచ్చింది.

S

Technology | Published On Sep 15, 2026, 3.50 pm IST

Redmi Note 17 Pro | 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్లు. ధర ఎంతంటే..
Advertisement

Redmi Note 17 Pro | షియోమీ తన ఎగువ మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ 5జితో పాటు ఈ సిరీస్‌లో తొలిసారిగా టాప్‌-టియర్‌ వేరియంట్‌గా రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ మ్యాక్స్ 5జిని కూడా తీసుకొచ్చింది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఫోన్లు ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో అధిక నిర్మాణ దృఢత్వం, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంపై షియోమీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫ్లాగ్‌షిప్‌ స్థాయి ఫీచర్లతోపాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌ మద్దతును కూడా అందిస్తోంది. ఈ ఫోన్లు రెండూ రెడ్‌మీ టైటన్‌ స్ట్రక్చర్‌పై రూపొందాయి. అధిక బలం క‌లిగిన మదర్‌బోర్డులు, రీన్‌ఫోర్స్‌డ్‌ మిడ్‌-ఫ్రేమ్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను ఇందులో అందించారు. టీయూవీ ఎస్‌యూడీ 5-స్టార్‌ టైటన్‌ క్వాలిటీ సర్టిఫికేషన్‌తోపాటు గ్రానైట్‌ ఉపరితలంపై 3 మీటర్ల వరకు పడిపోయినా తట్టుకునే సామర్థ్యానికి ఎస్‌జీఎస్‌ సర్టిఫికేషన్ ల‌భించాయి.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్‌లు ఉన్నాయి. నీటిలో ఫోన్‌ ఉపయోగించేందుకు అండర్‌వాటర్‌ మోడ్‌, తడిగా ఉన్న స్క్రీన్‌పై టచ్‌ పనిచేసేందుకు వెట్‌ టచ్‌ టెక్నాలజీ 2.0ను అందించారు. రెండు ఫోన్లలోనూ 6.83 ఇంచుల 1.5కె ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్ తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 3200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. హెచ్‌డీఆర్10 ప్ల‌స్‌, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ మ్యాక్స్ 5జిలో 4 నానోమీటర్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 5 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇక రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ లో స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 4 4 నానోమీటర్‌ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి.

భారీ బ్యాట‌రీ..

ప్రొ మ్యాక్స్‌లో భారీ 10,000 ఎంఏహెచ్‌ సిలికాన్‌-కార్బన్‌ బ్యాటరీని అందించారు. దీనికి 100 వాట్ల హైపర్‌చార్జ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5 వాట్ల రివర్స్‌ ఛార్జింగ్‌ మద్దతు ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాటరీ సామర్థ్యం 9,210 ఎంఏహెచ్‌గా ఉంటుంది. రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ లో 9,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ల హైపర్‌చార్జ్‌, 22.5 వాట్ల రివర్స్‌ ఛార్జింగ్‌ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ డైనమిక్‌ ర్యామ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా 24 జీబీ వరకు మెమరీని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రొ మ్యాక్స్‌కు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల పాటు కొత్త ఫోన్‌ తరహా స్మూత్‌ పనితీరుకు హామీ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్‌ పరంగా ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత షియోమీ హైపర్‌ఓఎస్‌ 3ను అందించారు. గూగుల్‌ జెమిని, సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఫొటోలు, వీడియోల ఎడిటింగ్‌లో ఏఐ గ్లేర్‌ రిమూవల్‌, ఏఐ ఎరేజ్‌ ప్రొ వంటి పోస్ట్‌-ప్రాసెసింగ్‌ సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు..

రెడ్‌మీ నోట్‌ 17 ప్రొలో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్‌ కెమెరాను అందించారు. ప్రొ మ్యాక్స్‌లో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్స‌ల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. ఇది 4కె వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు కూడా రెండు ఫోన్లలో ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్‌ 5.1ను ప్రొ మోడ‌ల్‌లో, బ్లూటూత్‌ 6.0 ను ప్రొ మ్యాక్స్‌లో అందించారు.

ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు..

రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ 5జి క్లౌడ్‌ బ్లూ, పర్పుల్‌ వైబ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.36,999గా ఉంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ మ్యాక్స్ 5జి సీక్రెట్‌ సన్‌రైజ్‌, మాచా గ్రీన్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో వస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.49,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.55,999గా ఉంది. రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ ను సెప్టెంబర్‌ 17 నుంచి, రెడ్‌మీ నోట్‌ 17 ప్రొ మ్యాక్స్ ను సెప్టెంబర్‌ 23 నుంచి విక్ర‌యించ‌నున్నారు. షియోమీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ఇండియా, షియోమీ రిటైల్‌ స్టోర్లు, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఎంచుకున్న ఎస్‌బీఐ, యాక్సిస్‌, కోటక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే నోట్‌ 17 ప్రొ పై రూ.3వేల వరకు, నోట్‌ 17 ప్రొ మ్యాక్స్‌పై రూ.5వేల వరకు తక్షణ బ్యాంక్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రత్యామ్నాయంగా హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ద్వారా నోట్ 17 ప్రొపై రూ.3వేల వరకు, ప్రొ మ్యాక్స్‌పై రూ.5వేల వరకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. పరిమిత కాలానికి నోట్‌ 17 ప్రొ తో రూ.7,499 విలువైన నోట్‌ 1 కేర్‌ ప్లాన్‌, నోట్‌ 17 ప్రొ మ్యాక్స్‌తో రూ.9,999 విలువైన నోట్‌ 1 కేర్‌ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో రెండు సంవత్సరాల స్క్రీన్‌ ప్రొటెక్షన్‌, రెండు సంవత్సరాల బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌, రెండు సంవత్సరాల వారంటీ ఉన్నాయి.

Advertisement
Advertisement