త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Portronics Vayu Nano | జేబులో ఇమిడే టైర్ ఇన్‌ఫ్లేటర్.. పోర్ట్రోనిక్స్ వాయు నానో లాంచ్..

Portronics Vayu Nano | కంప్యూట‌ర్స్‌, మొబైల్స్ యాక్స‌స‌రీస్ త‌యారీ సంస్థ పోర్ట్రోనిక్స్ భారత మార్కెట్లో కొత్తగా వాయు నానో పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్‌ను విడుదల చేసింది. ఈ అల్ట్రా-కాంపాక్ట్ కార్డ్‌లెస్ ఇన్‌ఫ్లేటర్‌ను ముఖ్యంగా కమ్యూటర్స్, బైకర్స్, సైక్లిస్టులు, అలాగే టూ-వీలర్లపై ప్రయాణించే వాహ‌న‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

S

Technology | Published On May 22, 2026, 5.02 pm IST

Portronics Vayu Nano | జేబులో ఇమిడే టైర్ ఇన్‌ఫ్లేటర్.. పోర్ట్రోనిక్స్ వాయు నానో లాంచ్..
Advertisement

Portronics Vayu Nano | కంప్యూట‌ర్స్‌, మొబైల్స్ యాక్స‌స‌రీస్ త‌యారీ సంస్థ పోర్ట్రోనిక్స్ భారత మార్కెట్లో కొత్తగా వాయు నానో పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్‌ను విడుదల చేసింది. ఈ అల్ట్రా-కాంపాక్ట్ కార్డ్‌లెస్ ఇన్‌ఫ్లేటర్‌ను ముఖ్యంగా కమ్యూటర్స్, బైకర్స్, సైక్లిస్టులు, అలాగే టూ-వీలర్లపై ప్రయాణించే వాహ‌న‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ పోర్ట్రోనిక్స్ వాయు నానో స్లీక్ బ్లాక్ మ్యాట్-ఫినిష్ బాడీతో వస్తుంది. అల్ట్రా-లైట్‌వెయిట్ ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా చేతిలో సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. దీని కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ వల్ల జేబుల్లో, బ్యాక్‌ప్యాక్స్‌లో, రైడింగ్ గేర్‌లో, స్కూటర్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్స్‌లో, అలాగే కార్ డ్యాష్‌బోర్డ్‌లో కూడా సులభంగా పెట్టుకోవచ్చు. టైర్లకు సులభంగా కనెక్ట్ చేయడానికి 7.5 సెం.మీ ఎయిర్ హోస్‌ను కూడా అందించారు.

కార్ల‌కు కూడా సుల‌భంగా గాలి పెట్ట‌వ‌చ్చు..

ఈ డివైస్ గరిష్టంగా 120 పీఎస్‌ఐ హై-ప్రెజర్ ఇన్‌ఫ్లేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. మోటార్‌సైకిళ్లకు 45 పీఎస్‌ఐ వరకు, సైకిళ్లకు 35 పీఎస్‌ఐ వరకు, స్పోర్ట్స్ బాల్స్‌కు 8 పీఎస్‌ఐ వరకు గాలి నింపగలదు. కంపెనీ తెలిపిన ప్రకారం 0 నుంచి 35 పీఎస్‌ఐ వరకు టైర్‌ను ఐదు నిమిషాల్లోపు నింపే సామర్థ్యం ఇందులో ఉంది. డివైస్‌లో స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో రియల్-టైమ్ పీఎస్‌ఐ, బార్ రీడింగ్స్ కనిపిస్తాయి. ప్రత్యేక ప్రీసెట్ ఇన్‌ఫ్లేషన్ మోడ్స్‌తో పాటు కస్టమ్ ప్రెష‌ర్ అడ్జస్ట్‌మెంట్ మోడ్ కూడా ఉంది. ఓవర్ ఇన్‌ఫ్లేషన్‌ను నివారించేందుకు ఇంటెలిజెంట్ ఆటో షట్-ఆఫ్ ఫీచర్‌ను ఇచ్చారు. వాయు నానోలో డ్యూయల్ 600ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీలు ఉన్నాయి. ఇది పూర్తిగా కార్డ్‌లెస్ ఆపరేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. రాత్రి ప్రయాణాలు, రోడ్‌సైడ్ ఎమర్జెన్సీలు, తక్కువ వెలుతురు పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్‌తోపాటు ఎస్ఓస్ ఎమర్జెన్సీ మోడ్‌ను కూడా అందించారు. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, ఇతర ఇన్‌ఫ్లేటబుల్ యాక్సెసరీస్ కోసం మల్టిపుల్ నోజిల్ అడాప్టర్స్ కూడా బాక్స్‌లో లభిస్తాయి.

భారీ డిస్కౌంట్ ధ‌ర‌తో..

పోర్ట్రోనిక్స్ వాయు నానో రూ. 2,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ఎంఆర్పీ రూ. 4,999గా ఉంది. ఈ ప్రొడక్ట్‌పై 12 నెలల వారంటీ కూడా లభిస్తుంది. పోర్ట్రోనిక్స్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, దేశవ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement