త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Orient Electric | విద్యుత్ కోత ఉన్నా ఇక నో టెన్ష‌న్‌.. 10 గంట‌లు న‌డిచే బ్యాట‌రీ సీలింగ్ ఫ్యాన్‌..

Orient Electric | తరచూ విద్యుత్ కోతలు ఎదుర్కొనే భారతీయ కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఒరియెంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తన కొత్త ఎకోటెక్ వోల్ట్ సీలింగ్ ఫ్యాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫ్యాన్‌లో ప్రత్యేకంగా రీచార్జబుల్ బ్యాటరీని ఇంట‌ర్న‌ల్‌గా అందించారు.

S

Technology | Published On Aug 17, 2026, 6.23 pm IST

Orient Electric | విద్యుత్ కోత ఉన్నా ఇక నో టెన్ష‌న్‌.. 10 గంట‌లు న‌డిచే బ్యాట‌రీ సీలింగ్ ఫ్యాన్‌..
Advertisement

Orient Electric | తరచూ విద్యుత్ కోతలు ఎదుర్కొనే భారతీయ కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఒరియెంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తన కొత్త ఎకోటెక్ వోల్ట్ సీలింగ్ ఫ్యాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫ్యాన్‌లో ప్రత్యేకంగా రీచార్జబుల్ బ్యాటరీని ఇంట‌ర్న‌ల్‌గా అందించారు. దీంతో బాహ్య ఇన్వర్టర్ లేదా ప్రత్యేక విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే గరిష్ఠంగా 10 గంటల వరకు గాలి అందించేలా దీనిని రూపొందించారు. ఎకోటెక్ వోల్ట్ ఫ్యాన్‌లో 28 వాట్ల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్, అంటే బీఎల్‌డీసీ మోటార్‌ను ఉపయోగించారు. సాధారణ ఇండక్షన్ సీలింగ్ ఫ్యాన్లతో పోలిస్తే ఈ మోటార్ విద్యుత్ వినియోగాన్ని 50 శాతం వరకు తగ్గించేలా రూపొందించారు. మోటార్‌లో డబుల్ బాల్-బేరింగ్ అసెంబ్లీని కూడా అందించారు.

10 గంటల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

ఈ ఫ్యాన్ 120 వోల్టుల‌ నుంచి 280 వోల్టుల‌ వరకు విస్తృత ఇన్‌పుట్ వోల్టేజ్ పరిధిలో పనిచేస్తుంది. దీంతో సాధారణంగా ఎదురయ్యే విద్యుత్ వోల్టేజ్ హెచ్చుతగ్గులను కూడా ఇది తట్టుకుంటుంది. ఫ్యాన్‌లోని ఇంట‌ర్న‌ల్ బ్యాటరీ 500 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80 శాతం వరకు సామర్థ్యాన్ని నిలుపుకునేలా రూపొందించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఈ బ్యాటరీ గరిష్ఠంగా 10 గంటల వరకు ఫ్యాన్‌ను నడిపిస్తుంది. రూపకల్పన పరంగా ఎకోటెక్ వోల్ట్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. గ్లేసియర్ గ్రే, వైట్ రంగుల్లో ఈ ఫ్యాన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ధ‌ర వివ‌రాలు..

ఒరియెంట్ ఎలక్ట్రిక్ ఎకోటెక్ వోల్ట్ బీఎల్‌డీసీ ఫ్యాన్ గరిష్ఠ రిటైల్ ధరను రూ.6,799గా నిర్ణయించారు. అయితే ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా దీనిని రూ.4,594కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒరియెంట్ ఎలక్ట్రిక్ అధికారిక ఉత్పత్తి వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఇండియా వంటి రిటైల్ వేదికలలో కూడా ఈ ఫ్యాన్ అందుబాటులో ఉంది. ఉత్పత్తి నాణ్యత, విశ్వసనీయతకు మద్దతుగా ఒరియెంట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అసెంబ్లీపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇంట‌ర్న‌ల్ బ్యాటరీ యూనిట్‌కు ప్రత్యేకంగా 1 సంవత్సరం వారంటీ ఇస్తోంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురయ్యే ప్రాంతాల్లో అదనపు ఇన్వర్టర్ అవసరం లేకుండా చవకైన, స్వతంత్ర కూలింగ్ పరిష్కారాన్ని అందించడమే ఈ ఉత్పత్తి లక్ష్యంగా కంపెనీ పేర్కొంది. అదే సమయంలో విద్యుత్ పొదుపు, ఇంధన సంరక్షణకు సంబంధించిన విస్తృత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫ్యాన్‌ను రూపొందించినట్లు తెలిపింది.

Advertisement
Advertisement