Nissan Tekton | నిస్సాన్ టెక్టన్ ఎస్యూవీ లాంచ్.. రూ.10.49 లక్షల నుంచే ధర, 5 స్టార్ సేఫ్టీతో మార్కెట్లోకి..
Nissan Tekton | నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ టెక్టన్ ను లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.49 లక్షలుగా ఉంది. గురువారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవగా, జూలై 20 నుంచి డెలివరీలు ఇవ్వనున్నారు. కంపెనీ ఇప్పటివరకు అందించిన అత్యంత తక్కువ డెలివరీ టైమ్‌లైన్ ఇదేనని వెల్లడించింది.
Automobiles | Published On Jul 9, 2026, 2.30 pm IST
Nissan Tekton | నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ టెక్టన్ ను లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.49 లక్షలుగా ఉంది. గురువారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవగా, జూలై 20 నుంచి డెలివరీలు ఇవ్వనున్నారు. కంపెనీ ఇప్పటివరకు అందించిన అత్యంత తక్కువ డెలివరీ టైమ్‌లైన్ ఇదేనని వెల్లడించింది. నిస్సాన్ టెక్టన్, రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందించిన రీబ్యాడ్జ్డ్ మోడల్. అయితే దీనికి నిస్సాన్ పట్రోల్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక డిజైన్‌ను అందించారు. ఈ మోడల్‌తో నిస్సాన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు టెక్టన్, గ్రావైట్, మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ కలిపి నాలుగు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2023లో కిక్స్ నిలిపివేసిన తర్వాత మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో నిస్సాన్ మళ్లీ అడుగుపెట్టింది.
సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్..
నిస్సాన్ చీఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫీసర్ గిల్లౌమ్ కార్టియర్ మాట్లాడుతూ, భారత్‌ను నిస్సాన్ గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టెక్టన్‌ను భారత్‌లోనే తయారు చేసి మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా సహా పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి 50 దేశాలకు లక్ష యూనిట్ల ఎగుమతుల లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది. అలాగే 2027 తొలి త్రైమాసికం ముగిసేలోపు మరో కొత్త నిస్సాన్ మోడల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. టెక్టన్కు భారత్ ఎన్క్యాప్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. రెనాల్ట్ డస్టర్‌తో ఒకే ఆర్జీఎంపీ ప్లాట్‌ఫామ్, ఒకే బాడీ స్ట్రక్చర్, ఒకే సేఫ్టీ పరికరాలతో రూపొందిన కార్పొరేట్ ట్విన్ గా భారత్ ఎన్‌క్యాప్ పేర్కొంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32లో 30.49 మార్కులు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49లో 45 మార్కులు సాధించింది. అయితే ముందు సీటు, వెనుక మధ్య సీటులో చైల్డ్ సీట్ మౌంట్స్ అందుబాటులో లేవు. అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ రిమైండర్లు, పాదచారుల రక్షణ వ్యవస్థ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ధర వివరాలు..
టెక్టన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. విజియా 1.0 లీటర్ మాన్యువల్ ధర రూ.10.49 లక్షలు, విజియా ప్లస్ రూ.11.14 లక్షలు, అసెంటా రూ.11.79 లక్షలుగా ఉంది. అసెంటా 1.3 లీటర్ డీసీటీ ధర రూ.14.99 లక్షలు కాగా, ఎన్-కనెక్టా 1.0 లీటర్ ధర రూ.13.69 లక్షలు, 1.3 లీటర్ మాన్యువల్ రూ.14.99 లక్షలు, డీసీటీ రూ.16.49 లక్షలుగా ఉన్నాయి. టెక్నా వేరియంట్ 1.0 లీటర్ ధర రూ.15.39 లక్షలు కాగా, 1.3 లీటర్ మాన్యువల్ రూ.16.39 లక్షలు, డీసీటీ రూ.17.79 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ టెక్నా ప్లస్ 1.0 లీటర్ ధర రూ.16.49 లక్షలు కాగా, డీసీటీ వేరియంట్ రూ.18.59 లక్షలుగా ఉన్నాయి. కొనుగోలుదారులకు 50కు పైగా పర్సనలైజేషన్ ఎంపికలు, 11 పెయింట్ స్కీమ్స్, నాలుగు ఇంటీరియర్ థీమ్స్, మూన్‌బో గ్రే, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, పెర్ల్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఇండిగో బ్లూ వంటి ఆరు ఎక్స్టీరియర్ రంగుల ఆప్షన్లను అందుబాటులో ఉంచారు.
టెక్నికల్ ఫీచర్లు..
టెక్టన్ పొడవు 4,348 మిల్లీమీటర్లు, వెడల్పు 1,815 మిల్లీమీటర్లు, ఎత్తు 1,674 మిల్లీమీటర్లు కాగా, వీల్‌బేస్ 2,657 మిల్లీమీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 212 మిల్లీమీటర్లుగా ఉండటం ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ వాటిలో ఒకటిగా నిలుస్తోంది. ముందు భాగంలో పట్రోల్ స్ఫూర్తితో రూపొందించిన నిలువుగా ఉండే గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, వాటిని కలిపే సీ ఆకారంలోని డీఆర్ఎల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డస్టర్‌తో బాడీ ఆకృతి ఒకేలా ఉన్నప్పటికీ, టెక్టన్కు ప్రత్యేకమైన 18 ఇంచుల అలాయ్ వీల్స్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, బాడీ కలర్ టెయిల్‌గేట్‌ను అందించారు. టాప్ వేరియంట్లో రోజ్ గోల్డ్, బర్గండీ రంగుల ఇంటీరియర్ ఉండగా, మిగతా వేరియంట్లలో బ్లాక్-వైట్ థీమ్ అందించారు. ఇందులో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, బిల్ట్-ఇన్ గూగుల్ మ్యాప్స్, జెమినీ, 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, మాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గరిష్టంగా 19.4 కిలోమీటర్ల మైలేజ్..
సౌకర్యాల పరంగా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, లెవల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను అందించారు. టెక్టన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 పీఎస్ పవర్, 166 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తూ లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో లభిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.8 కిలోమీటర్లు, డీసీటీ వేరియంట్ లీటరుకు 18.5 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. రెనాల్ట్ డస్టర్‌లో ఉన్న 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రస్తుతం టెక్టన్‌లో అందించలేదు.
భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరిస్, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, రెనాల్ట్ డస్టర్, టాటా సియెర్రా, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్, టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ వంటి మోడళ్లకు నిస్సాన్ టెక్టన్ గట్టి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి



