Mivi One 5G | రూ.11,999కే మివి వన్ 5జి.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో అదిరిపోయే ఫీచర్లు..
Mivi One 5G | భారత్‌కు చెందిన ఆడియో బ్రాండ్ మివి తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. మివి వన్ 5జి పేరుతో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశీయంగా తయారు చేసిన ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వంటి ఫీచర్లను అందిస్తోంది.
Technology | Published On Sep 24, 2026, 5.06 pm IST
Mivi One 5G | భారత్‌కు చెందిన ఆడియో బ్రాండ్ మివి తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. మివి వన్ 5జి పేరుతో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశీయంగా తయారు చేసిన ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లోఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. సాధారణ మల్టీటాస్కింగ్, వీడియోలు చూడడం, సోషల్ మీడియా వినియోగం, సాధారణ గేమింగ్‌కు ఇది సరిపోతుందని కంపెనీ పేర్కొంది. 4జీబీ, 128జీబీ, 6జీబీ, 128జీబీ, 8జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఫోన్ లభిస్తోంది. ఫోన్ లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఇన్-సెల్ డిస్‌ప్లేను అందించారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.5డి కవర్ గ్లాస్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ కూడా ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో డ్యయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, సహాయక కెమెరా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో క్లియర్‌టాక్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది కంపెనీ సొంత మివి న్యూరల్ వాయిస్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. కాల్స్ సమయంలో గాలి, ట్రాఫిక్, చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు వంటి పరిసర శబ్దాలను రియల్‌టైమ్‌లో తగ్గించేలా ఈ సాంకేతికతను రూపొందించారు. ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. ఇది 18 వాట్ల పవర్ డెలివరీ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 5జి క్లీన్ ఆండ్రాయిడ్ 16ను ఇచ్చారు. బ్లోట్‌వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 18 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అందిస్తామని మివి హామీ ఇచ్చింది. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.

ధర వివరాలు..
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ సదుపాయం, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5 మిల్లీమీటర్ల ఆడియో జాక్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5జి ఎస్ఏ, ఎన్ఎస్ఏ, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్, బీడూయ్, యూఎస్‌బీ టైప్ సి వంటి సదుపాయాలు అందించారు. మివి వన్ 5జి ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించనున్నారు. అక్టోబర్ 8 అర్ధరాత్రి నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో అందుబాటులోకి వస్తుంది. బ్లూ, పింక్, గ్రీన్, బర్గండీ, నేవీ బ్లూ అనే ఐదు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది. 4జీబీ, 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, బిగ్ బిలియన్ డేస్ సమయంలో బ్యాంక్ ఆఫర్ కలిపి నెట్ ఎఫెక్టివ్ ధర రూ.11,999గా ఉంటుంది. 6జీబీ, 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా, ఆఫర్లతో రూ.13,499కు లభిస్తుంది. 8జీబీ, 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా, ఆఫర్లతో రూ.14,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ నెట్ ఎఫెక్టివ్ ధరల్లో ప్రారంభ ప్లాట్‌ఫామ్ ధర తగ్గింపులు, వర్తించే బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి ఉంటాయి.
ప్రత్యేక ఆఫర్లు సైతం..
జియో యూజర్లకు మివి ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మివి వన్ 5జిని కొనుగోలు చేసే యాక్టివ్ జియో సబ్‌స్క్రైబర్లకు 12 నెలల క్యాన్వా ప్రొ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని విలువ రూ.4వేలుగా కంపెనీ పేర్కొంది. అలాగే ఒక నెల హాట్‌స్టార్ మొబైల్, హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, 18 నెలల గూగుల్ జెమిని ప్రొ ప్లాన్‌తోపాటు 5,000జీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. అదనంగా 50జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది. అమ్మకాల అనంతర సేవల విషయంలో ఫోన్‌కు ఒక సంవత్సరం స్టాండర్డ్ వారంటీ, ఏడు రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఉంటుంది. మివి రిపేర్డ్ కాదు.. రీప్లేస్డ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. వినియోగదారులకు మివి కేర్ ప్లస్ యాప్ ద్వారా సహాయం అందుతుంది. దేశవ్యాప్తంగా 500కు పైగా భౌతిక సర్వీస్ సెంటర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. 19వేలకు పైగా పిన్‌కోడ్‌లలో ఉచిత డోర్‌స్టెప్ పికప్, డ్రాప్ సదుపాయం కూడా ఉంది. సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లో సేవలను పూర్తి చేయనున్నట్లు మివి తెలిపింది.
మివి వన్ 5జితో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించడం ప్రారంభ దశ మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో డిజైన్, ఇంజినీరింగ్, తయారీ వంటి అన్ని దశల్లో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే 12 నెలల్లో పూర్తిగా భారత్‌లో ఇంజినీరింగ్ చేసిన సొంత స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని మివి ప్రకటించింది.
తాజావార్తలు
- ●BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం
- ●దానం పదవి ఎందుకు పోయింది? తీర్పులో కీలకమైన మూడు అంశాలు ఇవే
- ●Anija Biryani Trivandrum | 11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!
- ●Raksha Expo 2026 | గ్లోబల్ సమ్మిట్‌లో ‘రక్షా ఎక్స్పో 2026’
- ●Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ - ఇంద్రలోకం నుంచి అప్సరసలు భూమిపైకి వస్తే !
- ●Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్‌కు సీనియర్ అడ్వకేట్ హోదా.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం

దానం పదవి ఎందుకు పోయింది? తీర్పులో కీలకమైన మూడు అంశాలు ఇవే

Anija Biryani Trivandrum | 11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!

Raksha Expo 2026 | గ్లోబల్ సమ్మిట్‌లో ‘రక్షా ఎక్స్పో 2026’



