త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక‌ప్ ట్ర‌క్‌.. హైలక్స్‌కు గట్టి పోటీ..

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా సంస్థ 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పిక‌ప్ కాన్సెప్ట్ ఆధారంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లైఫ్‌స్టైల్ పిక‌ప్ ట్రక్కును ఆవిష్కరించింది. దీనికి స్కార్పియో లైఫ్‌స్టైలర్ అనే నామ‌క‌ర‌ణం చేసింది. స్కార్పియో ఎన్‌లో ఉపయోగించిన అదే బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్‌పై ఈ వాహనం రూపొందింది.

S

Automobiles | Published On Aug 15, 2026, 1.02 pm IST

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక‌ప్ ట్ర‌క్‌.. హైలక్స్‌కు గట్టి పోటీ..
Advertisement

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా సంస్థ 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పిక‌ప్ కాన్సెప్ట్ ఆధారంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లైఫ్‌స్టైల్ పిక‌ప్ ట్రక్కును ఆవిష్కరించింది. దీనికి స్కార్పియో లైఫ్‌స్టైలర్ అనే నామ‌క‌ర‌ణం చేసింది. స్కార్పియో ఎన్‌లో ఉపయోగించిన అదే బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్‌పై ఈ వాహనం రూపొందింది. భారత మార్కెట్లో ఇది టయోటా హైలక్స్, ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వంటి పిక‌ప్ ట్రక్కులతో పోటీ పడనుంది. మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ ధరలు రూ.19.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధర క‌న్నా తక్కువ నుంచే ప్రారంభమవుతాయని సంస్థ ధ్రువీకరించింది. 2027 ఏప్రిల్ నాటికి ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో ప్రస్తుతం రూ.25 లక్షలకు పైగా ప్రారంభమయ్యే టయోటా హైలక్స్, ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్‌తో పోలిస్తే స్కార్పియో లైఫ్‌స్టైలర్ ధర గణనీయంగా తక్కువగా ఉండనుంది.

బాహ్య డిజైన్..

చూడగానే ఆకట్టుకునే విధంగా ఈ పిక‌ప్ ట్రక్కును కఠినమైన, కండలు తిరిగిన డిజైన్‌తో రూపొందించారు. ముందు భాగంలో ఎల్ ఆకారపు డీఆర్‌ఎల్ సిగ్నేచర్లు క‌లిగిన ఎత్తైన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు ఉన్నాయి. క్రోమ్ అలంకరణలతో కూడిన వెడల్పాటి హనీకోంబ్ డిజైన్ గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. బానెట్ ముందు అంచుపై స్కార్పియో అనే పేరును ప్రత్యేకంగా ఉంచారు. దిగువ భాగంలో మహీంద్రా అక్షరాలతో కూడిన కండలు తిరిగిన స్కిడ్ ప్లేట్, మెష్ డిజైన్‌తో కూడిన ఎయిర్ డ్యామ్, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి. స్కార్పియో లైఫ్‌స్టైలర్ పక్క భాగంలో డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది. డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్, భారీ సైడ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్, ప్రత్యేకమైన కింక్డ్ బెల్ట్‌లైన్‌ను ఇందులో అందించారు. వెనుక భాగంలో సి ఆకారపు డీఆర్‌ఎల్‌లతో కూడిన నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంపులు ఉన్నాయి. వీటి మధ్య బూట్‌లిడ్‌పై పెద్ద మహీంద్రా అనే పేరు కనిపిస్తుంది. ముందు భాగం మాదిరిగానే వెనుక బంపర్‌ను కూడా రగ్గడ్ డిజైన్‌తో రూపొందించారు.

మూడు ప్రత్యేక ఎడిషన్లలో..

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను వ్యాలీ, రీఫ్, ట్రెయిల్ అనే మూడు ఎడిషన్లలో అందించనుంది. వీటికి వరుసగా ఆర్టెమిస్ గ్రే, ఆక్వారీఫ్, సహారా బేజ్ రంగులను కేటాయించారు. ప్రత్యేకమైన డీకాల్స్, యాక్సెసరీలతో రూపొందించే ఈ మూడు ఎడిషన్లు పర్వతాలు, సముద్రాలు, ఎడారులు వంటి విభిన్న సహజ వాతావరణాలను ప్రతిబింబించేలా ఉంటాయి. బయటకు ఎంతో రగ్గడ్‌గా కనిపించే స్కార్పియో లైఫ్‌స్టైలర్ లోపలి భాగం మాత్రం మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా రూపొందించారు. డ్యాష్‌బోర్డ్ మధ్యలో నిలువు ఆకారంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఇరువైపులా ఏసీ వెంట్లు ఉన్నాయి. స్క్రీన్ కింద క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, పలు ఫిజికల్ కంట్రోల్స్ అందించారు. డ్రైవర్ ముందు మూడు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ టన్నెల్‌పై కూడా పలు ఫిజికల్ కంట్రోల్స్‌ను అందించారు. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, టెర్రైన్ మోడ్‌లు తదితర ఫీచర్ల‌ను ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by MotorBeam (@motorbeam)

స్కార్పియో ఎన్ ఇంజిన్లే..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌లో స్కార్పియో ఎన్‌లోని ఇంజిన్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 175 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 203 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన 2.0 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చని అంచనా. గేర్‌బాక్స్‌లు కూడా స్కార్పియో ఎన్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, -స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందించే అవకాశం ఉంది. ఎక్కడైనా వెళ్లగలిగేసామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిక‌ప్ ట్రక్కులో 4డబ్ల్యూడీ వ్యవస్థను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ మహీంద్రా ఈ పిక‌ప్ ట్రక్కును విక్రయించనుంది. అయితే ఆయా విదేశీ మార్కెట్లలో ఈ వాహనానికి స్కార్పియో బ్రాండింగ్ ఉండదు. అక్కడ దీనిని కేవలం లైఫ్‌స్టైలర్ పేరుతో విక్రయించనుంది.

Advertisement
Advertisement