Artificial Intelligence Impact on Jobs | రాబోయే మూడేళ్లలో ఆ ఉద్యోగాల్లో సగం గల్లంతే.. AI ఎఫెక్ట్‌పై ఇండియన్ అమెరికన్ బిలియనీర్ సంచలన కామెంట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దెబ్బకు రాబోయే మూడేళ్లలో కీలక రంగాల్లో సగం ఉద్యోగాలు మాయం కానున్నాయి. ఇండియన్ అమెరికన్ బిలియనీర్ నికేశ్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Technology | Published On Jul 4, 2026, 11.55 pm IST
- రాబోయే మూడేళ్లలో మార్కెటింగ్, ఫైనాన్స్, HR లాంటి విభాగాల్లో సగం ఉద్యోగాలు పోతాయని పలో ఆల్టో నెట్‌వర్క్స్ CEO నికేశ్ అరోరా అంచనా
- సాఫ్ట్‌వేర్ యాప్‌ల (SaaS) స్థానంలో స్వంతంగా ఆలోచించి, సలహాలు ఇచ్చే 'ఏజెంటిక్ AI' (Agentic AI) అప్లికేషన్లు వస్తాయి
- ఉద్యోగాలు పోయినప్పటికీ, టెక్నికల్, సేల్స్ (Sales) రంగాల్లో మాత్రం మానవ వనరుల అవసరం పెరుగుతుందని స్పష్టం
- ఐటీ రంగంలో మనుగడ సాగించాలంటే ప్రతి ఉద్యోగి వెంటనే 'AI సావీ'గా (AI నైపుణ్యాలు ఉన్నవారిగా) మారాలని సూచన
Artificial Intelligence Impact on Jobs | త్రినేత్ర.న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ రంగంలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండగా.. గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్‌వర్క్స్' (Palo Alto Networks) సీఈవో, ఇండియన్ అమెరికన్ బిలియనీర్ నికేశ్ అరోరా చేసిన తాజా వ్యాఖ్యలు ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. రాబోయే మూడేళ్లలో తమ కంపెనీలోని మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ (HR) లాంటి విభాగాల్లో సిబ్బందిని సగానికి తగ్గించనున్నట్లు ఆయన బాంబు పేల్చారు.
ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌కు AI చెక్
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అరోరా.. జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) పనుల్లో వస్తున్న మార్పులను వివరించారు. "నా అంచనా ప్రకారం రాబోయే మూడేళ్లలో కంపెనీల్లోని G&A విభాగాల్లో సగం మంది మాత్రమే మిగులుతారు. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ లాంటి విభాగాల్లో ప్రాసెస్ మేనేజ్‌మెంట్ పనులు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో రాబోయే అడ్వాన్స్‌డ్ AI అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత సులభంగా, తెలివిగా పూర్తి చేయవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు.
SaaS స్థానంలో సొంతంగా ఆలోచించే AI
ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం తీసుకున్న ఉద్యోగిగా రికార్డుకెక్కిన అరోరా.. భవిష్యత్తు టెక్నాలజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాస్ (SaaS - Software as a Service) అప్లికేషన్ల స్థానాన్ని ఏజెంటిక్ లేదా అటానమస్ AI భర్తీ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. "SaaS యాప్‌లకు సొంతంగా ఆలోచించే శక్తి లేదు. కానీ భవిష్యత్తులో రాబోయే AI అప్లికేషన్లకు ఒక అభిప్రాయం ఉంటుంది. పని చేసే విధానంలోనే ఇది భారీ మార్పులు తీసుకురాబోతోంది" అని ఆయన అన్నారు.
సగం మంది అవసరం ఉండదు
ఐఐటీ (BHU) వారణాసిలో చదువుకున్న అరోరా.. AI అసిస్టెంట్లు ఎలా పనిచేస్తాయో ఒక ఉదాహరణతో వివరించారు. "మీరు రాసిన ఒక మార్కెటింగ్ కాపీని AI అసిస్టెంట్‌కి ఇస్తే.. అది బాగోలేదని, బ్రాండ్ వాయిస్‌కి తగ్గట్టుగా లేదని చెప్పడమే కాకుండా, దాన్ని ఎలా మార్చాలో కూడా సూచిస్తుంది. దీనివల్ల సాధారణ ఉద్యోగులు కూడా చాలా స్మార్ట్‌గా పనిచేస్తారు. ఎక్కువ పనులను AI సిస్టమ్స్ చేసినప్పుడు, ఆ విభాగంలో నాకు సగం మంది ఉద్యోగుల అవసరం ఉండదు కదా" అని లాజికల్‌గా వివరించారు. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్ మార్కెటింగ్ విభాగంలో సుమారు 600 మంది పనిచేస్తుండటం గమనార్హం.
ఏ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది?
AI రాకతో కొన్ని ఉద్యోగాలు పోయినా, కొన్ని రంగాలకు మాత్రం డిమాండ్ భారీగా పెరుగుతుందని అరోరా అంచనా వేశారు. ముఖ్యంగా టెక్నికల్, సేల్స్ (Sales) రంగాల్లో అవకాశాలు మెరుగవుతాయన్నారు. "మీ ప్రొడక్ట్ నిజంగా మంచిదైతే, దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎక్కువ మంది మనుషులు కావాలి. ముఖ్యంగా 'AI సావీ' (AI skills) ఉన్న ఉద్యోగులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది" అని స్పష్టం చేశారు.
'AI సావీ'గా మారాల్సిందే
ప్రస్తుతం 90 శాతం మంది కార్పొరేట్ ఉద్యోగులకు AIపై సరైన పట్టు లేదని అరోరా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వయంగా ఈ నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఇది డార్వినియన్ మూమెంట్ (బలవంతుడే బతుకుతాడు అనే సిద్ధాంతం) లాంటిదని హెచ్చరించారు. ఇప్పటికే మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు AI రీస్ట్రక్చరింగ్ పేరుతో వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●1BHK Flat Bengaluru | "పెట్టుబడి కోసం కాదు, నా కల ఇది".. బెంగళూరులో రూ.80 లక్షలు పెట్టి 1BHK కొన్న యువకుడి ఎమోషనల్ స్టోరీ
- ●TGSRTC Free Pushpak Bus | బెంగుళూరు వెళ్తున్నారా? ఎంజీబీఎస్ వెళ్లే కష్టాలు అక్కర్లేదు.. టీజీఎస్ఆర్టీసీ తెచ్చిన ఈ ఫ్రీ ఆఫర్ వాడేసుకోండి!
- ●Telangana Police Jobs 2026 | "రాజకీయ ఉచ్చులో పడకండి".. పోలీస్ అభ్యర్థులకు గోపిరెడ్డి సీరియస్ వార్నింగ్, 5 వేల పోస్టులపై కీలక అప్డేట్!
- ●G Kishan Reddy | దక్షిణాది ఇంధన భద్రతలో సింగరేణి కీలకం కావాలి : కిషన్ రెడ్డి
- ●HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
- ●Youtube | యూట్యూబ్‌లో రిలీజైన మంచు విష్ణు కన్నప్ప - ఫ్రీగా స్ట్రీమింగ్

1BHK Flat Bengaluru | "పెట్టుబడి కోసం కాదు, నా కల ఇది".. బెంగళూరులో రూ.80 లక్షలు పెట్టి 1BHK కొన్న యువకుడి ఎమోషనల్ స్టోరీ

TGSRTC Free Pushpak Bus | బెంగుళూరు వెళ్తున్నారా? ఎంజీబీఎస్ వెళ్లే కష్టాలు అక్కర్లేదు.. టీజీఎస్ఆర్టీసీ తెచ్చిన ఈ ఫ్రీ ఆఫర్ వాడేసుకోండి!

Telangana Police Jobs 2026 | "రాజకీయ ఉచ్చులో పడకండి".. పోలీస్ అభ్యర్థులకు గోపిరెడ్డి సీరియస్ వార్నింగ్, 5 వేల పోస్టులపై కీలక అప్డేట్!

G Kishan Reddy | దక్షిణాది ఇంధన భద్రతలో సింగరేణి కీలకం కావాలి : కిషన్ రెడ్డి



