1BHK Flat Bengaluru | “పెట్టుబడి కోసం కాదు, నా కల ఇది”.. బెంగళూరులో రూ.80 లక్షలు పెట్టి 1BHK కొన్న యువకుడి ఎమోషనల్ స్టోరీ
ఓ యువకుడు పెద్ద ఇల్లు వదిలేసి.. బెంగళూరులో రూ.80 లక్షలు పెట్టి 1BHK ఫ్లాట్ ఎందుకు కొన్నాడో తెలుసా? దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే మీరూ ఎమోషనల్ అవుతారు.
Viral news | Published On Jul 4, 2026, 11.00 pm IST
- బెంగళూరుకు చెందిన ఓ యువకుడు రూ.80 లక్షలతో 1BHK ఫ్లాట్ కొనుగోలు
- పెట్టుబడి, లాభం కోసం కాకుండా కేవలం ఎమోషనల్ కనెక్ట్‌తోనే ఈ నిర్ణయం
- అద్దె ఇళ్లలో పెరిగిన ఆ వ్యక్తికి.. సొంతిల్లు అనేది చిన్ననాటి కల
- ఈ నిర్ణయంపై నెటిజన్లు సైతం పాజిటివ్‌గా స్పందిస్తూ ప్రశంసలు
1BHK Flat Bengaluru | త్రినేత్ర.న్యూస్ : సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే, ఇల్లు కొనేటప్పుడు చాలా మందికి వచ్చే ప్రధాన సందేహం.. ఇన్వెస్ట్‌మెంట్‌గా (Investment) భవిష్యత్తులో ఎంత లాభం వస్తుంది? రీసేల్ వాల్యూ ఎంత? అని ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ఏకంగా రూ.80 లక్షలు వెచ్చించి ఒక చిన్న 1BHK ఫ్లాట్ కొనుగోలు చేశాడు. పెద్ద ఇల్లు కొనే అవకాశం ఉన్నా సరే.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెబుతూ అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూ.80 లక్షలతో 1BHK ఎందుకంటే?
రెడిట్ (Reddit) ప్లాట్‌ఫామ్‌లో తన స్టోరీని షేర్ చేసిన ఈ యువకుడు.. తాను బెంగళూరులోని 'ప్రెస్టీజ్ సాంగ్ ఆఫ్ ది సౌత్' (Prestige Song of the South)లో ఈ 1BHK కొన్నట్లు తెలిపాడు. దీని కోసం దాదాపు మూడు నెలల పాటు ప్రాపర్టీ హంటింగ్ (Property Hunting) చేశానని చెప్పాడు. "నేను భవిష్యత్తులో వచ్చే రాబడి (Returns) కోసం ఈ ఇల్లు కొనలేదు. ఇది పూర్తిగా నా ఎమోషనల్ డెసిషన్" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
చిన్నప్పటి నుంచి అద్దె ఇళ్లలోనే పెరిగానని.. తమకంటూ ఒక సొంతిల్లు ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎప్పుడూ అనుభవించలేదని అతను చెప్పాడు. అందుకే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కాకుండా.. చిన్నప్పటి నుంచి తాను కన్న కలను సాకారం చేసుకునేందుకే ఈ ఫ్లాట్ కొన్నట్లు వివరించాడు.
కలల లోగిలి..
"ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు.. చిన్నప్పటి నుంచి నేను ఊహించుకున్న ఇల్లు" అని ఆ యువకుడు రాసుకొచ్చాడు. తన ఇంట్లో పెద్ద టీవీ, హోమ్ థియేటర్, ఎక్కడ చూసినా బుక్స్, ఒక హామాక్ (Hammock), కాఫీ కార్నర్, అత్యంత సౌకర్యవంతమైన సోఫా.. ఇలా తనకు నచ్చినట్లుగా ఆ ఇంటిని మార్చుకోవాలని కలలు కన్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే, రూ.80 లక్షలు పెట్టి 2BHK లేదా 3BHK కొనుక్కోవచ్చు కదా అని చాలామంది అంటారని అతనికి తెలుసు. కానీ, తానింకా సింగిల్ అని.. భవిష్యత్తులో పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి పెద్ద ఫ్యామిలీ హోమ్ (Family home) కొనుగోలు చేస్తానని స్పష్టం చేశాడు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే ఒంటరిగా తీసుకోవడం కంటే.. భవిష్యత్తులో జీవిత భాగస్వామితో కలిసి తీసుకుంటేనే బాగుంటుందనేది అతని ఆలోచన.
నెటిజన్ల ప్రశంసలు
ఈ ఎమోషనల్ పోస్ట్‌కి రెడిట్ యూజర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. అతని నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.
"నీకు ప్రశాంతత, సంతోషం ఇస్తే.. జనాలు చెప్పే 'స్మార్ట్ ఛాయిస్' కంటే అదే వంద రెట్లు ఉత్తమం" అని ఒకరు కామెంట్ చేశారు.
"ఇల్లు అంటే ఎప్పుడూ రీసేల్ వాల్యూ గురించే కాదు, మనకు సెటిల్డ్ అనిపించడం ముఖ్యం" అని మరొకరు మద్దతు తెలిపారు.
"1BHKకి రూ.80 లక్షలు అనేది ఎక్కువే అనిపించినా.. ఇల్లు కొనేటప్పుడు ఎమోషన్స్ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి" అంటూ నెటిజన్లు అతని ఫీలింగ్స్‌కు కనెక్ట్ అవుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..




