Google Maps | గూగుల్ మ్యాప్స్‌కు భారీ అప్‌డేట్.. ఏఐతో అనుసంధానం.. అద్భుతమైన కొత్త ఫీచర్లు..
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో అద్భుతమైన సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఏఐ ని జోడించారు. దీని వల్ల వినియోగదారులు యాప్‌లోనే వివిధ ప్రదేశాలకు చెందిన క్లిష్టమైన ప్రశ్నలను అడగవచ్చు. ఇందుకు గాను మ్యాప్స్ యాప్‌లో ప్రత్యేకంగా ఆస్క్ మ్యాప్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు.
Technology | Published On Mar 13, 2026, 12.21 pm IST
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో అద్భుతమైన సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఏఐ ని జోడించారు. దీని వల్ల వినియోగదారులు యాప్‌లోనే వివిధ ప్రదేశాలకు చెందిన క్లిష్టమైన ప్రశ్నలను అడగవచ్చు. ఇందుకు గాను మ్యాప్స్ యాప్‌లో ప్రత్యేకంగా ఆస్క్ మ్యాప్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు తమ సహజ భాషలోనే గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఏఐని ప్రశ్నలు అడగవచ్చు. దీంతో ఏఐ సమాధానాలు ఇస్తుంది. అలాగే ఇమర్సివ్ నావిగేషన్ అనే మరో ఫీచర్‌ను కూడా గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో ప్రవేశపెట్టింది. గత దశాబ్ద కాలంలో గూగుల్ మ్యాప్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఇదే అతి పెద్ద అప్‌డేట్ అని సంస్థ తెలిపింది.
ఏఐతో పనిచేసే ఆస్క్ మ్యాప్స్ ఫీచర్..
గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆస్క్ మ్యాప్స్ ఫీచర్ యాప్‌లోని మ్యాపింగ్ డేటాబేస్‌తో కలిసి పనిచేస్తుంది. దీని వల్ల సంప్రదాయ మ్యాప్స్ ద్వారా గతంలో పొందలేని సమాధానాలను సైతం ప్రస్తుతం యూజర్లు పొందవచ్చు. గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన ప్రకారం మ్యాప్స్‌లో కొత్తగా ఆస్క్ మ్యాప్స్ అనే బటన్ కనిపిస్తుందని పేర్కొంది. దీని ద్వారా యూజర్లు టెక్ట్స్ లేదా వాయిస్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని తెలిపింది. ఉదాహరణకు ఒక నిర్దిష్ట సమయంలో ఒక గమ్యస్థానికి వెళ్లేందుకు కారు లేదా మెట్రో ప్రయాణం ఏది మంచిది.. అని యూజర్లు అడగవచ్చు. అలాగే మార్గమధ్యలో టీ, కాఫీ ఎక్కడ తాగవచ్చో కూడా తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులు, అంచనా ప్రయాణ సమయం, సమీప ప్రదేశాల వివరాలను గూగుల్ మ్యాప్స్ విశ్లేషించి సూచనలు ఇస్తుంది. అలాగే నావిగేషన్ దిశలను కూడా చెబుతుంది.
యూజర్ అభిరుచులకు అనుగుణంగా..
ఇక భవిష్యత్తులో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే అందుకు సంబంధించి ప్లానింగ్ లేదా కొత్త ప్రదేశాల సెర్చ్‌లో కూడా మ్యాప్స్ నూతన అప్‌డేట్ సహాయ పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రాత్రి బయటకు వెళ్లే ప్లాన్ వేస్తే, లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్ చూస్తూ శాకాహార స్నాక్స్ తినేందుకు ఎక్కడికి వెళ్లవచ్చో మ్యాప్స్‌ను అడగవచ్చు. అప్పుడు అందుబాటులో ఉన్న డేటాను ఆస్క్ మ్యాప్స్ విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని యూజర్‌కు ఇస్తుంది. అందులో మెనూ ఐటమ్స్, మ్యాచ్ రోజుల్లో ఉండే వాతావరణం, వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉందా.. వంటి వివరాలు కూడా ఉంటాయి. ఇక ఈ ఫీచర్ వినియోగదారులు నివాసం ఉండే లేదా తరచూ తిరిగే ప్రదేశాలకు అనుగుణంగా సూచనలు ఇస్తుంది. యూజర్లు యాప్‌లో గతంలో వెతికిన లేదా సేవ్ చేసిన ప్రదేశాలను కూడా ఈ ఫీచర్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక యూజర్ తరచూ శాకాహార రెస్టారెంట్‌లను వెతికితే కొత్త నగరంలో భోజనం కోసం సూచించే సమయంలో అదే తరహా ఆప్షన్‌లను ముందుగా చూపిస్తుంది. దీంతో యూజర్ల అభిరుచులకు అనుగుణంగా సూచనలు లభిస్తాయి.

ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాకింగ్..
కొత్త అప్‌డేట్ ద్వారా గూగుల్ మ్యాప్స్ యాప్‌లో యూజర్లు ఫాలో అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు. యూజర్లు మరిన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తమ సెర్చ్‌ను మరింత క్లారిటీగా పొందవచ్చు. ఉదాహరణకు ఏ ప్రదేశంలో పార్కింగ్ సులభంగా లభిస్తుందో లేదా ఏ ప్రదేశం సులభంగా చేరుకోగలిగేదో అడగవచ్చు. గూగుల్ తెలిపిన ప్రకారం ఏఐ ని మ్యాప్స్‌లో అనుసంధానించడం వల్ల మ్యాప్స్‌లో ఉన్న 30 కోట్లకు పైగా ప్రదేశాల వివరాలను యూజర్లు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అంటే అన్ని ప్రదేశాలను ఏఐ ఎల్లప్పుడూ స్కాన్ చేస్తుందన్నమాట. ఇక ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా యూజర్లు అందించే రివ్యూలు, ఫొటోలు, రేటింగ్, అప్‌డేట్స్‌ను కూడా ఏఐ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. దాని ప్రకారం యూజర్లకు సమాచారం అందజేస్తుంది.
భారత్, అమెరికా యూజర్లకు మాత్రమే..
గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఆస్క్ మ్యాప్స్ ఫీచర్‌తోపాటు ఇతర ఫీచర్లు కలిగిన కొత్త అప్‌డేట్ ప్రస్తుతం భారత్, అమెరికాలలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని గూగుల్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై గూగుల్ మ్యాప్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్లను పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి కొత్త ఫీచర్లను కేవలం ఇంగ్లిష్‌లోనే అందిస్తున్నారు. త్వరలోనే హిందీ భాషకు కూడా సపోర్ట్‌ను అందిస్తామని గూగుల్ తెలిపింది. ఇక ఈ ఫీచర్లతోపాటు కొత్త అప్‌డేట్‌లో ఇమర్సివ్ నావిగేషన్ అనే ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. దీని వల్ల కొత్త విజువల్ డిజైన్ అందుబాటులోకి వచ్చింది. డ్రైవింగ్ సూచనలు ఇకపై మరింత స్పష్టంగా, అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి.
3డీలో ప్రయాణ మార్గ వివరాలు..
ఇమర్సివ్ నావిగేషన్ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ప్రయాణ మార్గంలోని పరిసరాలను 3డీలో చూపిస్తుంది. మార్గంలోని భవనాలు, భూభాగం, ఫ్లై ఓవర్లు వంటి అంశాలను కూడా ఇందులో చూపిస్తుంది. రోడ్డులో ఉన్న వివరాలను హైలైట్ చేస్తుంది. లేన్లు, జీబ్రా క్రాసింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్ లైన్‌లను కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇందులోనూ ఏఐని అనుసంధానించారు. కనుక సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఏఐ మోడల్స్ స్ట్రీట్ వ్యూ ఫొటోలు, వైమానిక ఫొటోలను విశ్లేషించి యూజర్లకు సమాచారం అందిస్తాయి. గూగుల్ మ్యాప్స్ కొత్త అప్‌డేట్ ద్వారా డ్రైవర్లు తమ ముందు ఉండే మార్గాన్ని విస్తృతంగా తెలుసుకోవచ్చు. ముందున్న మలుపులు లేదా లేన్ మార్పులను ముందుగానే అందిస్తుంది. అలాగే వాయిస్ నావిగేషన్ సూచనలను కూడా మరింత సహజంగా ఉండేలా మార్పు చేశారు. ఇక గూగుల్ మ్యాప్స్‌లో ఇమర్సివ్ నావిగేషన్ ఫీచర్ ప్రస్తుతం అమెరికా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ భారత్‌లోనూ దీన్ని త్వరలోనే అందించనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






