త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup 2026 Song | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండుగే.. షకీరా పాడిన ఫిఫా వరల్డ్ కప్ 2026 సాంగ్ అదుర్స్.. వీడియోలో మెరిసిన మెస్సీ

వాకా వాకా, లా లా లా.. తర్వాత షకీరా మరో వరల్డ్ కప్ సాంగ్‌తో వచ్చేసింది. మెస్సీ, ఎంబాపె లాంటి స్టార్లతో రూపొందిన 'డై డై' సాంగ్ విశేషాలు మీకోసం..

J

Sports | Published On May 24, 2026, 7.07 pm IST

FIFA World Cup 2026 Song | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండుగే.. షకీరా పాడిన ఫిఫా వరల్డ్ కప్ 2026 సాంగ్ అదుర్స్.. వీడియోలో మెరిసిన మెస్సీ
Advertisement
  • ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్ 'డై డై' (DAI DAI) మ్యూజిక్ వీడియో విడుదల
  • ఫేమస్ సింగర్స్ షకీరా, బర్నా బాయ్ పాడిన ఈ పాటలో లాటిన్ పాప్, ఆఫ్రోబీట్స్ అద్భుతంగా బ్లెండ్ 
  • వీడియోలో మెరిసిన లియోనెల్ మెస్సీ, ఎంబాపె, వినిసియస్ జూనియర్ లాంటి టాప్ ఫుట్‌బాల్ స్టార్స్ 
  • ఈ సాంగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా పిల్లల చదువు, క్రీడా సదుపాయాల కోసం ఫిఫా ఫండ్‌కు అందజేస్తారు

త్రినేత్ర.న్యూస్ : FIFA World Cup 2026 Song | త్రినేత్ర.న్యూస్ : 2010లో 'వాకా వాకా' (Waka Waka), 2014లో 'లా లా లా' (La La La) అంటూ ప్రపంచాన్ని ఊపేసిన పాప్ సెన్సేషన్ షకీరా (Shakira) మరోసారి ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చేసింది. రాబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) అఫీషియల్ సాంగ్ 'డై డై' (DAI DAI) మ్యూజిక్ వీడియోను తాజాగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

స్టార్ ఆటగాళ్లతో కన్నుల పండుగ

ఈ వీడియో కేవలం సాంగ్ మాత్రమే కాదు, ఫుట్‌బాల్ స్టార్లతో నిండిన ఒక విజువల్ ట్రీట్. షకీరా, ప్రముఖ ఆఫ్రోబీట్స్ సింగర్ బర్నా బాయ్ (Burna Boy) కలిసి పాడిన ఈ పాటలో లాటిన్ పాప్, ఆఫ్రోబీట్స్ అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి. ఫుట్‌బాల్ కల్చర్‌ను, గ్లోబల్ యూనిటీని చాటిచెబుతూ రూపొందిన ఈ వీడియోలో సాకర్ దిగ్గజాలు సందడి చేశారు. లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాపె, వినిసియస్ జూనియర్, రోడ్రి, లుయిస్ డియాజ్, క్రిస్టియన్ పులిసిక్, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలండ్ లాంటి వరల్డ్ టాప్ సాకర్ స్టార్లు ఇందులో క్యామియో (Cameo) రోల్స్‌లో మెరిశారు.

సోషల్ మీడియాలో షకీరా ట్వీట్

ఈ వీడియో రిలీజ్ సందర్భంగా షకీరా ఎక్స్‌ (ట్విట్టర్)లో తన సంతోషాన్ని పంచుకున్నారు. "మేం రెడీ! ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్ 'DAI DAI' వీడియో వచ్చేసింది. ఈ వీడియోలో భాగమైన మెస్సీ, ఎంబాపె, వినిసియస్ జూనియర్, రోడ్రి, టేక్‌ఫుసా కుబో, శాంటియాగో గిమెనెజ్, అల్ఫోన్సో డేవిస్, జమాల్ ముసియాలా, పులిసిక్, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలండ్ అందరికీ పెద్ద థ్యాంక్స్" అని ఆమె ట్వీట్ చేశారు. మే 14నే ఈ ఆడియో ట్రాక్‌ను రిలీజ్ చేయగా, ఇప్పుడు అఫీషియల్ మ్యూజిక్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సాంగ్ వెనుక ఉన్న గొప్ప ఉద్దేశం (Charitable Cause)

'డై డై' పాట కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఈ సాంగ్ ద్వారా వచ్చే రాయల్టీ (Royalties) మొత్తాన్ని నేరుగా ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్‌ (FIFA Global Citizen Education Fund)కు అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లలకు హై-క్వాలిటీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందించాలనే ఉద్దేశంతో ఏకంగా 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సేకరించడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన టార్గెట్.

మరి ఇంకెందుకు ఆలస్యం, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వరల్డ్ కప్ అఫీషియల్ సాంగ్‌ను మీరూ చూసేయండి!

Advertisement
Advertisement