Saina Nehwal | బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పిన సైనా నెహ్వాల్.. ఆర్థరైటిస్ సమస్యతోనే నిర్ణయం..
Saina Nehwal | ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, షట్లర్ సైనా నెహ్వాల్ తన ఆటకు అధికారికంగా వీడ్కోలు పలికింది. ఇక తన శరీరం, ముఖ్యంగా మోకాళ్లు సహకరించడం లేదని, మరింతగా ఆటను కొనసాగించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా, 2023 సింగపూర్ ఓపెన్ తర్వాత ఏ అధికారిక మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు.
Saina Nehwal | ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, షట్లర్ సైనా నెహ్వాల్ తన ఆటకు అధికారికంగా వీడ్కోలు పలికింది. ఇక తన శరీరం, ముఖ్యంగా మోకాళ్లు సహకరించడం లేదని, మరింతగా ఆటను కొనసాగించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా, 2023 సింగపూర్ ఓపెన్ తర్వాత ఏ అధికారిక మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు. దీర్ఘకాలంగా వెంటాడుతున్న మోకాలి సమస్యలే దీనికి కారణమని వెల్లడించింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సైనా, నిజానికి రెండేళ్ల క్రితమే ఆటకు దూరమైనట్టు తెలిపింది. నేను నా ఇష్టంతోనే ఈ ఆటలోకి వచ్చాను, నా ఇష్టంతోనే బయటకు వచ్చాను. అందుకే పెద్దగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదనిపించింది. ఇక ఆడలేని పరిస్థితి వస్తే అంతే, అదే నిజం.. అని ఆమె వ్యాఖ్యానించింది.
తన మోకాళ్లలో కార్టిలేజ్ పూర్తిగా దెబ్బతిని, ఆర్థరైటిస్ కూడా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సైనా తెలిపింది. ఈ విషయం తన తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పిన తర్వాతే అధికారికంగా రిటైర్మెంట్ విషయాన్ని బయటపెట్టినట్టు పేర్కొంది. ఇక బహుశా నేను ఆడలేను, చాలా కష్టం అవుతోంది.. అని వారితో చెప్పానని ఆమె గుర్తు చేసుకుంది. రిటైర్మెంట్ ప్రకటించకపోయినా అభిమానులకు తేడా కనిపించదని సైనా అభిప్రాయపడింది. నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది, సైనా ఆడటం లేదు అని.. అని ఆమె చెప్పింది. తేలికపాటి ట్రైనింగ్‌కే మోకాళ్లు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
ప్రపంచంలో ఉత్తమంగా నిలవాలంటే రోజుకు 8 నుంచి 9 గంటలు ట్రైనింగ్ చేయాలి. కానీ నా మోకాలు ఒకటి లేదా రెండు గంటలకే వాపు వచ్చి ఆగిపోతోంది. ఆ తర్వాత కొనసాగించడం చాలా కష్టం అవుతోంది. అప్పుడే అనిపించింది, ఇక చాలు, నేను దీనిని మరింత ముందుకు సాగించలేను.. అని సైనా భావోద్వేగంగా చెప్పింది. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో ఎదురైన తీవ్రమైన మోకాలి గాయం సైనా కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ గాయాన్ని జయించి 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించినా, మోకాలి సమస్యలు మాత్రం ఆమెను వదల్లేదు. 2024లో ఆమెకు మోకాళ్లలో ఆర్థరైటిస్ ఉందని, కార్టిలేజ్ గణనీయంగా దెబ్బతిన్నట్టు స్వయంగా వెల్లడించింది. భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ పటంపై నిలబెట్టిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సైనా నెహ్వాల్, తన పోరాటపటిమ, ఆటతో అనేక మంది యువతులకు ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు ఆమె బ్యాడ్మింటన్ కోర్టుకు దూరమైనా, భారత క్రీడా చరిత్రలో ఆమె స్థానం శాశ్వతమని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




