Jaspal Rana | షూటర్ మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
Jaspal Rana | భారత షూటింగ్ దిగ్గజం, కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వా విడిచారు.
Jaspal Rana | భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత షూటింగ్ దిగ్గజం, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 49 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కలికేష్ నారాయణ సింగ్ డియో తెలిపారు.
జర్మనీలోని మునిచ్‌లో ఇటీవలే జరిగిన షూటింగ్ ఈవెంట్‌కు జస్పాల్ రాణా హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. తిరుగు ప్రయాణంలో విమానంలో ఉన్న సమయంలో కూడా ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఆయన్ను నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు. కానీ షూటర్ రాణా ఆ చికిత్స నుంచి కోలుకోలేకపోయారు.
నేటి షూటర్ మనూ బాకర్ (Manu Bhaker)కు కూడా జస్పాల్ రాణానే కోచ్. క్రీడా రంగంలో మను సాధించిన ఎన్నో విజయాల వెనుక ఈయన కృషి ఉంది. రాణా మార్గదర్శకత్వంలోనే మను పారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరఫున రెండు పతకాలను గెలుచుకుంది. జస్పాల్ రాణా మృతి భారత షూటర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాణా.. 1976లో ఉత్తరాఖండ్‌లోని ఒక సైనిక కుటుంబంలో జన్మించారు. తన తండ్రి నుంచి శిక్షణ తీసుకున్నాడు. అలా 12 ఏళ్ల వయసులోనే షూటింగ్ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జస్పాల్ రాణా కోచ్‌గానే కాదు తన కెరీర్లో అత్యుత్తమ షూటర్‌గా నిలిచారు. ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో నాలుగు ఎడిషన్లలో (1994, 1998, 2002, 2006) అద్భుతమైన ప్రతిభ కనబరిచి అత్యంత విజయవంతమైన భారతీయ అథ్లెట్లలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. 2012లో ఆయన జాతీయ జూనియర్ పిస్తోల్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యారు.
Also Read..
ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
తాజావార్తలు
- ●Donald Trump | ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
- ●Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!
- ●Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
- ●WhatsApp | వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..
- ●Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..

Donald Trump | ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!

Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన



