త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచుల‌కు నిపుణుల క‌మిటీ ఒకే..!

IPL 2026 | ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల‌ను నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.

P

Sports | Published On Mar 16, 2026, 3.44 pm IST

IPL 2026 | ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచుల‌కు నిపుణుల క‌మిటీ ఒకే..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల‌ను నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ సొంత మైదానంలో ఐదు మ్యాచుల‌ను చిన్న‌స్వామి స్టేడియంలో ఆడుతుంది. మిగ‌తా రెండు మ్యాచుల‌ను రాయ్‌పూర్‌లో ఆడ‌నుంది. ఐపీఎల్ 19వ సీజ‌న్ మార్చి 28 నుంచి షురూ కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ త‌ల‌ప‌డ‌నున్న‌ది.

గ‌త సీజ‌న్‌లో ఆర్‌సీబీ తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్ర‌క సంద‌ర్భంలో అభిమానులు వేడుక‌ల‌ను ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ట్టుకు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం జట్టును సన్మానించింది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కేఎస్‌సీఏ ఆధ్వర్యంలో ప్లేయ‌ర్ల‌కు సన్మానం జరిగింది. జట్టు అక్కడికి చేరుకోకముందే, చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటు చేసుకున్న‌ది. తొలిసారిగా ట్రోఫీని నెగ్గ‌డంతో అభిమానులు సంబ‌రాలు చేసుకుంటుండ‌గా.. కొద్ది నిమిషాల్లోనే స్టేడియం ప‌రిస‌రాల‌ను విషాదం ఆవ‌రించింది. జూన్ 4న జ‌రిగిన ఈ తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత స్టేడియంలో మ్యాచుల‌ను ఆడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిని నిరాక‌రించింది.

క‌మిటీని క‌లిసిన కేఎస్‌సీఏ..

ప్రస్తుత ఐపీఎల్ సీజ‌న్‌కు ముందు ఎం చిన్నస్వామి స్టేడియంలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి క‌ర్నాట‌క రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి వివరించారు. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో పాటు, ప్రారంభోత్సవ వేడుకలకు కూడా ఆర్‌సీబీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్‌లో ఆ జ‌ట్టు స్టేడియంలో ఐదు మ్యాచులు ఆడుతుంది. మిగిలిన రెండు మ్యాచులను రాయ్‌పూర్‌లో ఆడనుంది. రాబోయే ఐపీఎల్ మ్యాచుల‌ను సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించడానికి తాము చేసిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలను ఆర్‌సీబీ ప్రతినిధులు, నిర్వహణ సంస్థల ప్రతినిధులు కమిటీ ముందు ఉంచారు. ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా చిన్నస్వామి స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది.

కేఎస్‌సీఏ అధికారులు, ఆర్‌సీబీ ఉన్నత స్థాయి యాజమాన్యం జీ మ‌హేశ్వ‌ర‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మ్యాచుల నిర్వహణకు తుది ఆమోదం లభించింది. ఆర్‌సీబీ ఆడాల్సిన ఐదు సొంత మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ స్టేడియంలో జరగనున్నాయి. ఇది ఫ్రాంచైజీకి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ముందస్తు ఒప్పందానికి అనుగుణంగా ఉండ‌నున్న‌ది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం తుది మ్యాచ్‌కు కూడా ఆతిథ్యం ఇస్తుంది. ఇదిలా ఉండ‌గా.. ఈ సారి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు విడుత‌ల్లో ప్ర‌క‌టించ‌నున్న‌ది. ఇప్ప‌టికే 20 మ్యాచుల‌కు సంబంధించిన షెడ్యూల్‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నాలుగు రాష్ట్రాల‌తో పాటు కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే మిగ‌తా మ్యాచుల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ సంద‌ర్భంగా అయితే, బీసీసీఐ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా నిపుణుల క‌మిటీ ఆమోదం మేర‌కు బెంగ‌ళూరులో మ్యాచుల నిర్వ‌హ‌ణ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement