IND vs SA | టీ20 ప్రపంచకప్‌లో రేపు దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. సంజు శాంసన్ నో ఛాన్స్..!
IND vs SA | టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా గ్రూప్ దశలో నాలుగు విజయాలతో సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2024 టీ20 వరల్డ్ కప్ రన్నరప్ అయిన దక్షిణాఫ్రికాతో సూపర్ 8 తొలి మ్యాచ్ ఆడనున్నది.
IND vs SA | టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా గ్రూప్ దశలో నాలుగు విజయాలతో సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2024 టీ20 వరల్డ్ కప్ రన్నరప్ అయిన దక్షిణాఫ్రికాతో సూపర్ 8 తొలి మ్యాచ్ ఆడనున్నది. ఇటీవల రెండు జట్లు ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నెగ్గాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉండగా.. గత ఓటమికి ఈ సారైనా బదులు తీర్చుకోవాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
శాంసన్‌కు నో ఛాన్స్..
టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. టోర్నీలో ఖాతా తెరిచేందుకు ఎదురుచూస్తున్నాయి. కీలకమైన సూపర్ ఎయిట్‌కు ముందు అభిషేక్ ఫామ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది. తుది జట్టు నుంచి అభిషేక్‌ను తప్పించడంపై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చ జరగలేదని, దాంతో అతని స్థానంలో శాంసన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ తక్కువని బౌలింగ్ కోచ్ మోర్కెల్ స్పష్టం చేశాడు. అభిషేక్‌ను వరుసగా రెండుసార్లు ఆఫ్-స్పిన్నర్లు అవుట్ చేశారు. దాంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ సైతం పవర్ ప్లేలో స్పిన్నర్లను బరిలోకి దించుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
తడబడుతున్న అభిషేక్..
ఫాస్ట్ బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాయి. మళ్లీ ఇదే జరిగితే తిలక్, సూర్యకుమార్‌లపై భారం పడనున్నది. సూపర్ ఎయిట్స్‌లో దక్షిణాఫ్రికా నుంచి టీమిండియా సవాల్ ఎదుర్కోనుంది. ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ తప్పా టాప్ ఫోర్‌లో మిగితా ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకు పెద్దగా రాణించింది లేదు. సూర్యకుమార్, తిలక్ ఫెసిలిటేటర్ల పాత్ర పోషించినప్పటికీ.. బంతి ఆగకుండా వచ్చే పిచ్‌లపై ఇద్దరు తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. టీమిండియా బ్యాటింగ్ భారం హార్దిక్ పాండ్యా, శివం దూబేపై పడింది. ఇద్దరు ఆల్‌రౌండర్ల నుంచి ఇంకా మంచి ప్రదర్శన చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
సుందర్ బెంచ్‌కే..
నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు టీమిండియా విశ్రాంతి ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో అక్సర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుదిజట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తుదిజట్టులో అక్షర్ రావడం దాదాపు ఖాయం. ఇప్పటికే జట్టులో హార్దిక్, శివం దూబే రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు. దాంతో వాషింగ్టన్ సుందర్ దాదాపుగా పక్కన పెట్టే అవకాశాలున్నాయి. పాక్‌తో జరిగిన మ్యాచ్ మినహా భారత్ ఇప్పటి వరకు ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించింది. తాజాగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పిస్తే అర్ష్‌దీప్ సింగ్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ ఆడిన విషయం తెలిసిందే. పొట్రీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్ భారం మోయనున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగితే.. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో ఓపెనింగ్ చేయనున్నాడు.
తుది జట్లు ఇలా ఉండొచ్చు..
టీమిండియా (అంచనా) : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా (అంచనా) : ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే, కేశవ్ మహారాజ్.
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
మే 21, 2026

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



