త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా డారిల్ మిచెల్‌

ICC ODI Rankings | స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను భార‌త జ‌ట్టు కోల్పోయింది. దాంతో ఐసీసీ వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూపింది. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ త‌న నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును కోల్పోయాడు.

P

Sports | Published On Jan 21, 2026, 3.36 pm IST

ICC ODI Rankings | ఐసీసీ వ‌న్డే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా డారిల్ మిచెల్‌
Advertisement
  • వారంలోనే రెండో స్థానానికి రెండోస్థానానికి ప‌డిపోయిన విరాట్ కోహ్లీ
  • దిగ‌జారిన రోహిత్ శ‌ర్మ ర్యాంకు

ICC ODI Rankings | స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను భార‌త జ‌ట్టు కోల్పోయింది. దాంతో ఐసీసీ వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూపింది. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ త‌న నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును కోల్పోయాడు. గ‌త‌వారంలోనే రోహిత్ శ‌ర్మను అధిగ‌మించి విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానానికి చేరుకున్న విష‌యం తెలిసిందే.న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ రేటింగ్ పాయింట్లు పెరిగిన‌ప్ప‌టికీ మిచెల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించ‌డంతో ర్యాంకుల్లో దూసుకువ‌చ్చాడు.

భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో మిచెల్ మూడు ఇన్సింగ్స్‌లో రెండు సెంచ‌రీలు, ఒక హాఫ్ సెంచ‌రీ స‌హాయంతో మొత్తం 352 ర‌న్స్ చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డంతో రేటింగ్ పాయింట్లు 784 నుంచి 845కి పెరిగాయి. దాంతో ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానాన్ని చేరుకున్నాడు. విరాట్ ప్ర‌స్తుతం రెండోస్థానంలో ఉన్నాడు. టీమిండియా మ‌రో స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ నాలుగో ర్యాంకులో ఉన్నాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్ కేవ‌లం 61 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. ఆరంభంలో బాగానే ప‌రుగులు చేసినా.. భారీ ఇన్సింగ్స్ ఆడ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. దాంతో ర్యాంకు ప‌త‌న‌మైంది. టీమిండియా మ‌రో బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ టాప్‌-10లో ప్ర‌వేశించాడు. రాహుల్ తొలి వ‌న్డేలో మ్యాచ్ విన్నింగ్ ఇన్సింగ్ ఆడిన విష‌యం తెలిసిందే. ఇక రెండో వ‌న్డేలోనూ 112 ప‌రుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో కేవ‌లం ఒక ప‌రుగుకే అవుట్ అయినా ర్యాంకు మెరుగుప‌డింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 5వ స్థానంలో, శ్రేయాస్ అయ్య‌ర్ 11వ స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఇబ్ర‌హీమ్ జ‌ర్దాన్ (ఆఫ్ఘ‌నిస్తాన్‌), ఆరో స్థానంలో బాబ‌ర్ ఆజామ్‌, ఏడో స్థానంలో హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్‌), 8వ ప్లేస్‌లో షాయ్ హోప్ (వెస్టిండిస్‌), 9వ స్థానంలో చరిత్ అసలంక (శ్రీ‌లంక‌) ఉన్నారు.

బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఆరు స్థానాలు మెరుగుప‌రుచుకొని 33వ స్థానానికి చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌల‌ర్ జోప్రా ఆర్చ‌ర్ 2వ స్థానంలో ఉండ‌గా.. మ‌తీష తీక్ష‌(శ్రీ‌లంక‌) మూడోస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, నమీబియాకు చెందిన బెర్నార్డ్ స్కోల్ట్జ్ నాలుగు, ఐదు స్థానాల‌కు చేరుకున్నారు. టీమిండియా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ నాలుగు స్థానాలు దిగ‌జారి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ ఒక స్థానం మెరుగుప‌రుచుకొని 14వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆల్ రౌండ‌ర్ల జాబితాలో అక్ష‌ర్ ప‌టేల్‌కు టాప్ 10లో చోటు ద‌క్క‌లేదు. 203 పాయింట్ల‌తో 11వ స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘ‌నిస్తాన్ ప్లేయ‌ర్ అజ్మ‌తుల్లా ఉమర్జాయ్ 334 రేటింగ్‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement