త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chess Olympiad | చెస్ ఒలింపియాడ్‌.. భార‌త జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన చెస్ ఫెడ‌రేష‌న్‌.. వుమెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా తెలుగుతేజం..!

Chess Olympiad | చెస్ ఒలింపియాడ్ 2026 సంద‌ర్భంగా చెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్‌, వుమెన్స్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరగనున్న టోర్నమెంట్ జ‌రుగ‌నున్న‌ది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో భార‌త్ మ‌రోసారి గోల్డ్ మెడ‌ల్‌ను నిల‌బెట్టుకోవాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ది.

P

Sports | Published On Jul 24, 2026, 5.26 pm IST

Chess Olympiad | చెస్ ఒలింపియాడ్‌.. భార‌త జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన చెస్ ఫెడ‌రేష‌న్‌.. వుమెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా తెలుగుతేజం..!
Advertisement

Chess Olympiad | చెస్ ఒలింపియాడ్ 2026 సంద‌ర్భంగా చెస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్‌, వుమెన్స్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరగనున్న టోర్నమెంట్ జ‌రుగ‌నున్న‌ది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో భార‌త్ మ‌రోసారి గోల్డ్ మెడ‌ల్‌ను నిల‌బెట్టుకోవాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ది. ఓపెన్ కేట‌గిరిలో ప్ర‌స్తుత ప్ర‌పంచ చాంపియ‌న్ డీ గుకేశ్‌, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. మహిళల జట్టుకు సీనియ‌ర్ ప్లేయ‌ర్ కోనేరు హంపి నాయకత్వం వ‌హించ‌నుంది. ఓపెన్, మహిళల విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని నెగ్గాల‌ని భావిస్తున్నారు.

అంద‌రి దృష్టి గుకేశ్‌పైనే..

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పటి గుకేశ్ ఆ త‌ర్వాత ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. దాంతో గత 19 నెలల్లో రేటింగ్ 75 పాయింట్లు తగ్గింది. ఇటీవల జరిగిన చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లోనూ మూడింట్లో ఓడిపోయి కేవలం రెండు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. గత ఒలింపియాడ్ త‌ర‌హాలోనే గుకేష్ ఫామ్‌లోకి వ‌చ్చి కీల‌క‌పాత్ర పోషిస్తాడ‌ని భార‌త్ ఆశిస్తోంది. మ‌రో వైపు ప్రజ్ఞానంద అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మాగ్నస్ కార్ల్‌సెన్, అలీరేజా ఫిరోజ్‌జా, గుకేష్, విన్సెంట్ కీమర్ వంటివారిని ఓడించాడు. జూన్‌లో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు.

2024లో భారత్ మిస్ట‌రీ..

2024లో బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారిగా ఓపెన్ విభాగంలో గోల్డ్ మెడ‌ల్‌ను నెగ్గింది. చివరి రౌండ్‌లో స్లోవేనియాతో జరిగిన మ్యాచ్‌ల‌లో గుకేష్, అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద తమ మ్యాచులను గెలుచుకుని భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. విదిత్ గుజరాతీ తన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. అదే టోర్నమెంట్‌లో మహిళల జట్టు సైతం అద్భుతంగా రాణించి, అజర్‌బైజాన్‌ను 3.5-0.5 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఈసారి భార‌త్ ప్లేయ‌ర్లు టైటిల్ ఫేవ‌ర్స్‌గా బ‌రిలోకి దిగుతున్నారు.

భార‌త జ‌ట్టు..

ఓపెన్ కేటగిరీ: డి గుకేశ్, అర్జున్ ఎరిగైసి, ఆర్ ప్రగ్నానంద, నిహాల్ సరిన్, విదిత్ గుజరాతీ.
కెప్టెన్: శ్రీనాథ్ నారాయణన్
మహిళల విభాగం : కోనేరు హంపీ, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, సవిత శ్రీ బీ.
కెప్టెన్: స్వయంసేవక్ మిశ్రా

Advertisement
Advertisement