త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cameron Green | రూ.25.20 కోట్ల‌కు అమ్ముడైన కామెరాన్ గ్రీన్‌.. వెంట‌నే మ్యాచ్‌లో డ‌కౌట్‌..

S

Cricket | Published On Dec 17, 2025, 1.33 pm IST

Cameron Green | రూ.25.20 కోట్ల‌కు అమ్ముడైన కామెరాన్ గ్రీన్‌.. వెంట‌నే మ్యాచ్‌లో డ‌కౌట్‌..
Advertisement

Cameron Green | ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధ‌ర ప‌లికిన విష‌యం విదిత‌మే. అత‌న్ని ద‌క్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే రూ.25.20 కోట్ల భారీ ధ‌ర‌కు అత‌న్ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ సొంతం చేసుకుంది. దీంతో గ్రీన్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన విదేశీ ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంటల్లోనే అత‌ను మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. దీంతో కోల్‌క‌తాను సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అన్ని కోట్లు పెట్టి కొంటే గ్రీన్ డ‌కౌట్ అయ్యాడ‌ని ఎద్దేవా చేస్తున్నారు. కాగా కామెరాన్ గ్రీన్ ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో యాషెస్ సిరీస్ టెస్టు మ్యాచ్‌లో చీప్‌గా ఔట్ అవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

కామెరాన్ గ్రీన్ వాస్త‌వానికి టెస్టు, టీ20, వ‌న్డే అన్ని ఫార్మాట్ల‌లోనూ చ‌క్క‌ని ఆల్ రౌండ్ ప్లేయ‌ర్‌గా గుర్తింపు పొందాడు. బంతిని బౌండ‌రీల‌కు త‌రలించ‌డంలో దిట్ట‌. అలాగే పేస్ బౌలింగ్‌తోనూ ఆక‌ట్టుకోగ‌ల‌డు. అందుక‌నే అత‌ని ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు అత‌న్ని కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే కోల్‌క‌తా భారీ ధ‌ర‌కు అత‌న్ని కొనుగోలు చేయ‌గా, అంద‌రూ ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఇక త‌రువాత రోజు అడిలైడ్‌లో జ‌రుగుతున్న యాషెస్ సిరీస్ 3వ టెస్టు మ్యాచ్‌లో క్రీజులోకి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంట‌నే వెనుదిరిగాడు. షార్ట్ బంతిని క‌ట్ చేయ‌బోయి క్యాచ్ ఇచ్చి డ‌కౌట్‌గా పెవిలియ‌న్ చేరాడు. దీంతో అత‌న్ని ఉద్దేశించి నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం అత‌నికి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.

కామెరాన్ గ్రీన్ ను కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో డ‌కౌట్ అయినంత మాత్రాన అలా విమ‌ర్శించ‌కూడ‌ద‌ని, అత‌ను ఒక మ్యాచ్ విన్న‌ర్ అని, క‌చ్చితంగా రాణిస్తాడ‌ని, ఐపీఎల్‌కు ఇంకా స‌మ‌యం ఉంది క‌నుక త‌న‌ను తాను రుజువు చేసుకుంటాడ‌ని అంటున్నారు. ఇక యాషెస్ సిరీస్ 3వ టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి త‌న తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 326 ప‌రుగుల వ‌ద్ద కొన‌సాగుతోంది. క్రీజులో స్టార్క్‌, ల‌యాన్ ఉన్నారు. ఆసీస్ వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీ సెంచ‌రీ (106)తో ఆక‌ట్టుకోగా మ‌రో బ్యాట్స్‌మ‌న్ ఉస్మాన్ ఖ‌వాజా (82) చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బ్రైడాన్ కార్స్‌, విల్ జాక్స్ చెరో 2 వికెట్లు తీశారు. జాష్ టంగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది. కాగా యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్ప‌టికే రెండు మ్యాచ్ లలో విజ‌యాల‌తో 2-0 ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement