త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI | అత్యాధునిక సౌక‌ర్యాల‌తో హైకోర్టు జోన్‌-2 భ‌వ‌న నిర్మాణాలు.. శంకుస్థాప‌న చేసిన సీజేఐ

CJI | హైకోర్టు జోన్‌-2 (High court zone-2) భ‌వ‌న‌ నిర్మాణ‌ ప‌నుల‌(Building construction works) కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ సూర్య‌కాంత్ (CJI Suryakanth) శంకుస్థాప‌న చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప‌రిధి బుద్వేల్‌ (Budwel)లో న్యాయ‌మూర్తుల భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు సీజేఐ కొబ్బ‌రికాయ కొట్టి అట్ట‌హాసంగా ప్రారంభించారు.

S

News | Published On Apr 5, 2026, 12.11 pm IST

CJI | అత్యాధునిక సౌక‌ర్యాల‌తో హైకోర్టు జోన్‌-2 భ‌వ‌న నిర్మాణాలు.. శంకుస్థాప‌న చేసిన సీజేఐ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: హైకోర్టు జోన్‌-2 (High court zone-2) భ‌వ‌న‌ నిర్మాణ‌ ప‌నుల‌(Building construction works) కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ సూర్య‌కాంత్ (CJI Suryakanth) శంకుస్థాప‌న చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప‌రిధి బుద్వేల్‌ (Budwel)లో న్యాయ‌మూర్తుల భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు సీజేఐ కొబ్బ‌రికాయ కొట్టి అట్ట‌హాసంగా ప్రారంభించారు. శంకుస్థాప‌న స‌మ‌యంలో సీఎం రేవంత్‌తో పాటు, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మ‌ట్టి వేశారు. అత్యాధునిక వ‌సతుల‌తో ఈ నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. శంకుస్థాప‌న అనంతరం హైకోర్టు భవన నమూనా ఫొటో ప్రదర్శనను సీజేఐ తిలకించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తున్నారు.

రెండో ద‌శ‌లో భాగంగా నిర్మిస్తున్న హైకోర్టు నూత‌న భ‌వ‌నం ప‌నులు ప్ర‌స్తుతం కొన‌సాగుతుండ‌గా సీజేఐ శంకుస్థాప‌న చేసి ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ కార్యక్ర‌మానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

Advertisement
Advertisement