TPCC Mahesh Kumar Goud | కాంగ్రెస్‌పై మాట్లాడ్డానికి జీవన్‌రెడ్డి ఎవరు?: మహేశ్‌కుమార్ గౌడ్
TPCC Mahesh Kumar Goud | జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫాం ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి ఎవరని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు జీవన్‌రెడ్డి గతంలో బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు.
త్రినేత్ర.న్యూస్: జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫాం ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి ఎవరని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు జీవన్‌రెడ్డి గతంలో బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. ఆయన విమర్శలను ఎవరూ పట్టించుకొనే స్థతిలో లేరన్నారు. గురువారం గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా(Press meet)తో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా కలిసి రేవంత్‌ను సీఎంగా ఎన్నుకున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. అవి రేపైనా ఒక్కటే అవుతాయని విమర్శించారు.
పరిస్థితులను బట్టి ముందుకెళ్లాలని, సీఎం రేవంత్ పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరు బాగుపడలేదని చెప్పారు. ప్రజల్లో మార్పు వచ్చి బీఆర్ఎస్‌ను వద్దనుకున్నారని అందుకే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. బీఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందని.. తాము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటిదాకా ఎక్కడ గీత కూడా పడలేదన్నారు. కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదు అని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఆధారాలతో గాంధీ భవన్‌కు రండి..
పొంగులేటి పై వచ్చిన ఆరోపణలపై ఆధారాలుంటే కాంగ్రెస్ ఏం చేయాలో ఆలోచిస్తుంది. పొంగులేటిపై విమర్శలు కాదు. ఆధారాలు ఉంటే గాంధీ భవన్ కు తీసుకొని రండి. మీ సవాల్‌కు నేను సిద్ధం. పస లేని ఆరోపణలు చేయొద్దు. నాదర్గుల్ భూముల కుంభకోణం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగింది. మా మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. హరీశ్ రావు దగ్గర ఆధారాలుంటే తీసుకొని రావాలి. బీఆర్‌ఎస్ హయాంలోనే ఆ భూముల వ్యవహారం జరిగిందని, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని పొంగులేటి అంటున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్ , ఎస్సీ సెల్ చైర్మన్ శంకర్ నాయక్ అందరం ఎన్ఎస్‌యూఐ నుంచి వచ్చిన వాళ్లమే. నాయకత్వాన్ని అందిస్తున్న ఒక మహత్తర కంపెనీ అది. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి నేతృత్వంలో ముందుకు సాగాలి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




