త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr. Sanjay | మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్క‌డ‌ : ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్

Dr. Sanjay | తెలంగాణ (Telangana) రైత‌న్న న‌ష్టాల్లో కూరుకుపోతున్నార‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ (Dr. Sanjay) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాధార‌ణంగా రైతుకు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇపుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయని వాపోయారు.

A

News | Published On Mar 17, 2026, 12.15 pm IST

Dr. Sanjay | మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్క‌డ‌ : ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్
Advertisement

Dr. Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌ : తెలంగాణ (Telangana) రైత‌న్న న‌ష్టాల్లో కూరుకుపోతున్నార‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ (Dr. Sanjay) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాధార‌ణంగా రైతుకు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇపుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయని వాపోయారు. అసెంబ్లీ (Assembly)లోని మీడియా పాయింట్ వ‌ద్ద సంజ‌య్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ యాసంగికి రైతు భరోసా ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలుకు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు లేవని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు త‌మ‌కు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల‌కు పెట్టుబ‌డి లేద‌ని, క‌రెంటు లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వ వైఖ‌రితో రైతులు చాలా న‌ష్ట‌పోతున్నార‌ని మండిప‌డ్డారు. ఈ రేవంత్‌రెడ్డి ప్ర‌స్తుతాన్ని నాశ‌నం ప‌ట్టించి, భ‌విష్య‌త్తు గురించి ఆలోచ‌న చేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టికైనా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌ళ్లు తెర‌వాల‌ని హితవు ప‌లికారు.

Advertisement
Advertisement