Dasoju Sravan Kumar | కాంగ్రెస్ భూ దొంగలపై ధర్మ యుద్ధం ఆపం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju Sravan Kumar | కాంగ్రెస్ భూ దొంగలపై ధర్మ యుద్ధం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan Kumar) తేల్చిచెప్పారు. పొంగులేటి రియల్ ఎస్టేట్ ప్రెడేటర్ గా మారిపోయారని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలన్నారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా మా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ భూ దొంగలపై ధర్మ యుద్ధం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan Kumar) తేల్చిచెప్పారు. పొంగులేటి రియల్ ఎస్టేట్ ప్రెడేటర్ గా మారిపోయారని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియా(Press meet)తో మాట్లాడారు. కొత్వాల్ గూడ, మానస హిల్స్, వట్టి నాగులపల్లి, నాదర్ గుల్ లో వెలాది ఎకరాలు దోచుకుంటున్నారని.. ఇదేనా జై సంవిధాన్ అని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా మా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని, వెంటనే భేషరతు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్ నియంత పోకడలతో వెళ్తోందనడానికి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టులే నిదర్శనమన్నారు. నాదర్ గుల్ భూముల కేసు సుప్రీంకోర్టులో ఉండగా అక్కడ ఫెన్సింగ్ ఎలా పెడుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ దొంగలు చెలరేగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూములను గద్దల్లా ఎత్తుకెళ్తున్నారని, వైట్ కాలర్ క్రిమినల్స్ మీరు అని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
రియల్ ఎస్టేట్ కోసమే భూములు రాసిస్తున్నరా?
నాదర్ గుల్ లో 613 /119 సర్వే నెంబర్ 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. సీలింగ్ కు లోబడి భూములు లేవు. దీన్ని 2020లో హైకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయినా సిగ్గు, లజ్జ లేకుండా ఆ భూమి తమదని నకిలీ పత్రాలతో వస్తున్నరు. తెలంగాణలో అసలు రాజ్యాంగం ఉందా? అన్ని భూములు పొంగులేటికి రాసిస్తున్నారా? ఇదేమి చిల్లర రాజకీయం, రియల్ ఎస్టేట్ దందా కోసమే ప్రభుత్వం నడుస్తుంది. డబ్బులు ముడుతున్నాయని ఏఐసీసీ మౌనంగా ఉంటుంది అని దాసోజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ..
తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారింది. బరితెగించి బట్టలు విప్పి తిరుగుతాం అనేటట్టు ప్రభుత్వ వైఖరి ఉంది.
ఇక్కడ దోచుకున్న సొమ్మును వేరే రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారు. రైతులే తమను బెదిరిస్తున్నారని కంపెనీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణను గుల్ల చేయాలనుకుంటున్నారా? కేబినెట్ మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా గప్ చుప్ గా ఉన్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత తప్పు చేసిన వారందరూ జైల్లో ఉండాల్సిందే అని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




