త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: క‌విత‌

Kalwakuntla Kavitha | ఈనెల 25న కొత్త రాజ‌కీయ శ‌క్తి (New political force)గా రాబోతున్నామ‌ని, సిరిసిల్ల నుంచి పాద‌యాత్ర‌గా పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

S

News | Published On Apr 21, 2026, 1.46 pm IST

Kalwakuntla Kavitha | 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: క‌విత‌
Advertisement

Kalwakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్‌: ఈనెల 25న కొత్త రాజ‌కీయ శ‌క్తి (New political force)గా రాబోతున్నామ‌ని, సిరిసిల్ల నుంచి పాద‌యాత్ర‌గా పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రేప‌టి నుంచి చేప‌ట్టే ఆర్టీసీ (RTC strike) స‌మ్మెకు పూర్తి మ‌ద్ద‌తు(support) తెలుపుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌క‌టించారు.

కేంద్రాన్ని ప‌ల్లెత్తు మాట అన‌లే..

కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి పబ్లిసిటి మెటీరియల్ డిస్ట్రబ్ చేయొద్దని జిహెచ్ఎంసీనీ కోరుతున్న. ఆర్టీసీ సమ్మెకు మా పూర్తి పద్ధతి మద్దతు ఉంటుంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు. రాష్ట్రం లో మక్కలు కొనే దిక్కు లేక‌పోవ‌డం దుర్మార్గం. నిన్న బీఆర్ఎస్ సభలో ప్రజల సమస్యలపై ప్రస్తావించకుండా ఉత్తుత్తి కథలు చెప్పారు. బీఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ పార్టీలో మహిళలకు ఉలాగూ గౌరవం లేదు. ఓటమి కారణం ప్రజలు అని వారిని తప్పు పడుతున్నారు. ఇది స‌రైంది కాదు అని క‌విత అన్నారు.

రాజశేఖర్ రెడ్డి ఉన్న‌ప్పుడు నాకు తెలంగాణ గురించి ఎందుకు అని ఆనాడు జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి బీఆర్ఎస్ ఎక్కడా మాట్లాడటం లేదు. 75 సంవత్సరాల కురువృద్ధుడు బిఆర్ఎస్ లో ఏమి చేస్తారు. గుంట నక్క ఢిల్లీ వెళ్తే ముఖ్యమంత్రి డీల్ కుదుర్చేలా చెబుతున్నారు. ఎవరు ప్రతిపక్షంలో, ఎవరు అధికారంలో ఉండాలనేది చెప్పడానికి సీఎం ఎవరు? అని ఆమె ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ ఉత్త క‌థలు.. కాంగ్రెస్ రెడ్డి పిట్ట క‌థ‌లు..

వచ్చే పదేళ్లలో ఎక్కడ అధికారంలో ఉంటారు..? ఎవ‌రు అధికారంలో ఉంటార‌నేది నిర్ణ‌యించ‌డానికి మీరెవ‌రు? ఆ విష‌యాన్ని మీరెలా చెబుతారు? ఎవ‌రు పాలించాలో, ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో ఉండాలో నిర్ణ‌యించేది ప్రజలు. వారే చెబుతారు. నిన్న జరిగిన రెండు సభల్లో బీఆర్ఎస్ ఉత్త కథలు చెబితే కాంగ్రెస్ రెడ్డి పిట్ట కథలు చెప్పిండు.. అని క‌విత విమ‌ర్శించారు.

Advertisement
Advertisement