TPCC Chief Mahesh Kumar Goud | మేమంతా NSUI ఫ్యాక్టరీ నుంచి వచ్చినోల్లమే.. అందరూ చేరండి: మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం
NSUI Foundation Day | జాతీయ నాయకులు మెజారిటీ సంఖ్యలో ఎన్ఎస్‌యూఐ (NSUI) ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారేనని, నా మాతృ సంస్థ కూడా ఇదేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రోద్బలంతో ఈ సంస్థను ఎర్పాటు చేశారని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: జాతీయ నాయకులు మెజారిటీ సంఖ్యలో ఎన్ఎస్‌యూఐ (NSUI) ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారేనని, నా మాతృ సంస్థ కూడా ఇదేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. నాటి ఎన్ఎస్‌యూఐ సభ్యులే నేడు తెలంగాణలో ముఖ్య పదవుల్లో ఉన్నారని, కష్టపడినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రోద్బలంతో ఈ సంస్థను ఎర్పాటు చేశారని చెప్పారు. NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం(Foundation Day) సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన జెండాను ఆవిష్కరించి కేకు కోశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యార్థి సంఘ ఎన్నికలపై సీఎంతో మాట్లాడతాం: మంత్రి పొన్నం
అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంస్థలు, విద్యార్థి సంఘాల ఎన్నికల వల్లే నాలాంటి మొదటి తరం నాయకులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇటీవల విద్యా కమిషన్ కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సూచించిందన్నారు. కేంద్ర యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడి ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
NSUIలో చేరండి..
కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఎన్ఎస్‌యూఐలో సభ్యులుగా చేరి దేశ భవిష్యత్తు, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. పరిపక్వత కలిగిన రాజకీయ పరిజ్ఞానంతో, విద్యార్థి సమస్యల పోరాటాలతో రాజకీయాలపై అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్ లో మంచి రాజకీయతరం రావడానికి విద్యార్థి సంఘాల ఎన్నికలు పునాది లాంటివన్నారు. బీజేపీ ఇతర పార్టీలకు విధాన పరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ విద్యార్థి సంఘాల ఎన్నికలు చేపట్టాలన్నారు. ప్రతిఒక్కరూ NSUIలో చేరాలని పొన్నం కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, NSUI అధ్యక్షులు వెంకట్ స్వామి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




