Ritika Nayak | గ్లామర్ రోల్స్‌తో కాకుండా యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలతో టాలీవుడ్‌లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఢిల్లీ బ్యూటీ రితికానాయక్. అశోకవనంలో అర్జున కళ్యాణం, మిరాయ్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఓ సినిమా చేయబోతుంది. హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌ను వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం రివీల్ చేశారు. ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే పేరును కన్ఫామ్ చేశారు. ఐ యామ్ బ్యాక్... ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. టైటిల్ వీడియో గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదలచేశారు. యాక్షన్ అంశాలతో ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. ఈ గ్లింప్స్‌లో మాస్ లుక్‌లో వరుణ్ తేజ్ కనిపించారు. ఐ యామ్ బ్యాక్ అంటూ గ్లింప్స్ చివరలో కొరియన్ భాషలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ హిట్టు అందుకొని నాలుగేళ్లు అవుతోంది. 2022లో వచ్చిన ఎఫ్3 తర్వాత అతడు హీరోగా నటించిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ పరాజయాలతో కథల ఎంపికలో తన స్టైల్ మార్చిన వరుణ్ తేజ్ హిట్టు కోసం హారర్ కామెడీ జానర్‌ను ఎంచుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సక్సెస్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది.డైరెక్టర్‌గా మేర్లపాక గాంధీ కూడా మూడేళ్ల తర్వాత కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సమ్మర్‌లో కొరియన్ కనకరాజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.