త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murdered | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హ‌త్య‌

Murdered | హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ (Jubilee hills) ప్రశాసన్‌నగర్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌రే భార్య సునంద (55) (Sunanda) శుక్ర‌వారం ఉద‌యం దారుణ హత్యకు గురయ్యారు.

S

News | Published On May 8, 2026, 12.33 pm IST

Murdered | రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హ‌త్య‌
Advertisement

Murdered | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ (Jubilee hills) ప్రశాసన్‌నగర్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌రే భార్య సునంద (55) (Sunanda) శుక్ర‌వారం ఉద‌యం దారుణ హత్యకు గురయ్యారు. డబ్బుల కోసం సునందను పనిమనిషి కల్పన గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్ట‌ర్స్‌లో ప్లాట్ నంబ‌ర్ 46లో నివాస‌ముంటున్న సునంద‌ను క‌ల్ప‌న‌ మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని ముగ్గురు పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఘ‌ట‌నా స్థ‌లానికి సీపీ స‌జ్జ‌నార్ చేరుకొని ప‌రిస్థితులపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌కు స‌బంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఘ‌ట‌నా స్థ‌లానికి డీజీపీ..

ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే డీజీపీ ఆనంద్ జూబ్లీహిల్స్‌కు చేరుకున్నారు. ఐఏఎస్ క్వార్ట‌ర్స్ లో ఘ‌ట‌నా స్థ‌లాన్ని పోలీసుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అక్క‌డే ఉన్న వారిని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. హ‌త్య ఎందుకు చేశారు, ఎలా జ‌రిగింద‌నే విష‌యాల‌పై ఆరా తీస్తున్నారు.

మేము వద్దని చెప్తున్నా వాళ్ల‌నే పనిలో కొనసాగిస్తున్నరు: సీపీ స‌జ్జ‌నార్‌

క్లూస్ లభ్యం అయ్యాయి. ఇది నేపాలీ గ్యాంగ్ పనే. హ‌త్య స‌మ‌యంలో పిల్లలు పైన ఉన్నారు. సార్ లేరు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపేశారు. సంవత్సరం క్రితం ఇంట్లో పనికి చేరింది. బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో ఈ హత్య చేశారు. నేపాల్ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని రెండు నెలల నుంచి చెబుతున్నాం.

 

Advertisement
Advertisement