త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BMT Nursing Conference | BMT చికిత్సలో న‌ర్సుల తెగువ స్ఫూర్తిదాయకం: జె.ఎస్.ఆర్. ప్రసాద్

BMT Nursing Conference | BMT వంటి అత్యంత సున్నితమైన చికిత్సలో ప్రాణాలను నిలబెట్టడంలో నర్సింగ్ సిబ్బంది చూపిన ధైర్యం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని జె.ఎస్.ఆర్. ప్రసాద్ (JSR Prasad) అన్నారు. బోన్ మార్ ట్రాన్స్ ప్లాంట్ (BMT) నర్సింగ్- విజ్ఞానం, ఆచరణల మధ్య వారధి అనే అంశంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారి నర్సింగ్ విభాగం శ‌నివారం ఒక రోజు నర్సింగ్ కాన్ఫరెన్స్ కార్య‌క్ర‌మం నిర్వహించారు.

S

News | Published On May 9, 2026, 6.28 pm IST

BMT Nursing Conference | BMT చికిత్సలో న‌ర్సుల తెగువ స్ఫూర్తిదాయకం: జె.ఎస్.ఆర్. ప్రసాద్
Advertisement

Bone Marrow Transplant | త్రినేత్ర‌.న్యూస్‌: BMT వంటి అత్యంత సున్నితమైన చికిత్సలో ప్రాణాలను నిలబెట్టడంలో నర్సింగ్ సిబ్బంది చూపిన ధైర్యం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని జె.ఎస్.ఆర్. ప్రసాద్ (JSR Prasad) అన్నారు. క‌చ్చితత్వం, మానవత్వాన్ని గుర్తిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. బోన్ మార్ ట్రాన్స్ ప్లాంట్ (BMT) నర్సింగ్- విజ్ఞానం, ఆచరణల మధ్య వారధి అనే అంశంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారి నర్సింగ్ విభాగం శ‌నివారం ఒక రోజు నర్సింగ్ కాన్ఫరెన్స్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు ప్ర‌సంగించారు.

ముఖ్య అతిథిగా ట్రస్టు బోర్డు సభ్యులు జె.ఎస్.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ.. 200 చిన్నపిల్లల కేసులతో సహా 700 ఎముక మజ్జ మార్పిడులు (BMT) విజయవంతంగా నిర్వహించింద‌న్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యధిక సంఖ్యలో BMT చికిత్సలు అందించిన కేంద్రంగా నిలిచిన BIACH&RI ఘనత సాధించిందని వెల్లడించారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన హెమటో-ఆంకాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ బృందాలను ఆయ‌న‌ ప్రశంసించారు. BMT వంటి అత్యంత సున్నితమైన చికిత్సలో ప్రాణాలను నిలబెట్టడంలో నర్సింగ్ సిబ్బంది చూపిన ధైర్యం, క‌చ్చితత్వం, మానవత్వాన్ని గుర్తిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

బోన్ మార్ ట్రాన్స్ ప్లాంట్ (BMT) నర్సింగ్ -విజ్ఞానం, ఆచరణ (BMT Nursing Conference - Bridging Knowledge & Practice) అనే అంశంతో ఒక రోజు నర్సింగ్ కాన్ఫరెన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాలలోని నర్సింగ్ నిపుణులకు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు రెండు తెలుగు రాష్ట్రాలలలోని వివిధ హాస్పిటల్స్ లో పని చేస్తున్న సుమారు 250 మంది నర్సులు హాజ‌రయ్యారు.

జె యస్ ఆర్ ప్రసాద్, BIACH&RI డా.కల్పనా రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్, అకడమిక్స్, BIACH&RI, డా. సెంథిల్ రాజప్ప, మెడికల్ ఆంకాలజీ విభాగం, BIACH&RI, డా.ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపరింటెండెంట్, BIACH&RI, కందుల శ్రీవాణి, నర్సింగ్ సూపరింటెండెంట్, BIACH&RI, మీనా కుమారి, ప్రిన్సిపాల్, కేర్ నర్సింగ్ కాలేజి, నాంపల్లి, డా. వీరేంద్ర పాటిల్, కన్సల్టెంట్, పీడియాట్రిక్ ఆంకాలజీ, బీయంటీ వైద్య నిపుణులు కలిసి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు.

కందుల శ్రీవాణి, డా. కె కల్పనా రఘునాథ్‌ మాట్లాడుతూ నర్సింగ్ విభాగంలో ఉన్న నర్సులందరికీ, ముఖ్యంగా ఆంకాలజీ నర్సింగ్ లో పని చేస్తున్న నర్సులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాల‌న్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికపుడు సాన పెట్టుకొంటూనే ముందుకు సాగాల‌న్నారు. డా.సెంథిల్ రాజప్ప మాట్లాడుతూ BMT సంరక్షణలో నాయకత్వం, ఆధార-సహిత ఆచరణను స్వీకరించేలా నర్సులు ఉండాలని సూచించారు.

ఈ అకడమిక్ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్, టాటా మెమోరియల్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వంటి జాతీయ సంస్థలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు కండిషనింగ్ రెజిమెన్‌లు, ట్రాన్స్‌ఫ్యూజన్ పద్ధతులు, CART-సెల్ థెరపీ, ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో వచ్చే సమస్యలు, సపోర్టివ్ కేర్ నర్సింగ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నర్సింగ్ విభాగపు ప్రతినిధులు మాట్లాడుతూ నిర్వహించిన నర్సింగ్ కాన్ఫరెన్స్ "సకాలంలో చేపట్టిన, ఆచరణాత్మకమైన కార్యక్రమం"గా అభివర్ణించారు. ఈ కార్యక్రమ నర్సులకు నాయకత్వ నైపుణ్యాలు, సాక్ష్యాధారిత ప్రోటోకాల్‌లు, సంక్లిష్టమైన ఎముక మజ్జ మార్పిడి కేసులను నిర్వహించడంలో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని చెప్పారు. రోగి పక్కన ఎదురయ్యే వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించినందుకు, ఇంటరాక్టివ్ ప్యానెల్ చర్చలు, కేస్-ఆధారిత అభ్యాసాన్ని కాన్ఫరెన్స్ లో భాగంగా ఉంచడాన్ని వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యాపకులకు, ప్రతినిధులకు, సిబ్బందికి నిర్వాహక కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సులో అధిక భాగస్వామ్యం, భారతదేశంలో ఆంకాలజీ నర్సింగ్ విద్యను అభివృద్ధి చేయాలనే నిబద్ధత పెరుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంది.

 

Advertisement
Advertisement