Oscars | ఆస్కార్ రేసులో తెలుగు షార్ట్ ఫిల్మ్ – 14 నిమిషాల రన్‌టైమ్‌తో..
ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌కు అర్హత సాధించింది. అనూయ స్వామి దర్శకత్వంలో హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రలో నటించిన పంకజ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో 99వ ఆస్కార్ అవార్డుల్లో పోటీపడబోతుంది.అనూయ , హర్షిణి ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం.
Oscars | తెలుగు అమ్మాయిలు రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ రేసులో నిలిచింది. అనూయ స్వామి దర్శకత్వం వహించిన పంకజ షార్ట్ ఫిల్మ్ 99వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో స్థానాన్ని దక్కించుకుంది. 14 నిమిషాల నిడివితో కూడిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో హర్షిణి బోయళ్ల అనే మరో తెలుగు అమ్మాయి కీలక పాత్రలో నటించింది.
రెండు భాషల్లో....
బెంగళూరు మురికివాడల నేపథ్యంలో తెలుగు, కన్నడ పంకజ లఘు చిత్రాన్ని అనూయ స్వామి తెరకెక్కించారు. తప్పిపోయిన తన భర్తను వెతుక్కుంటూ కూతురు లల్లితో కలిసి పంకజ అనే మహిళ సాగించిన ప్రయాణం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందింది. స్థిరమైన ఉద్యోగాలు లేని వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఇంటి పెద్ద అదృశ్యమైతే ఆ ప్రభావం మిగిలిన కుటుంబసభ్యులపై ఏ విధంగా పడుతుందనే సందేశాన్ని అందించారు డైరెక్టర్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో హర్షిణి, పద్మశ్రీ నటనకు ప్రశంసలు వచ్చాయి.
నలభై ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో...
ఈ ఏడాది జూన్‌లో జరిగిన లండన్‌లో జరిగిన రెయిన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును దక్కించుకోవడం ద్వారా ఆస్కార్‌కు అర్హతను సాధించింది. ఇప్పటివరకు నలభైకిపైగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. న్యూయార్క్‌లోని ఐఎఫ్‌సీ ఆర్ట్ థియేటర్‌లో నెల రోజుల పాటు పంకజ షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు.
తెలుగు కుటుంబంలో...
అనూయ స్వామి బెంగళూరుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చదువుతున్న టైమ్‌లోనే పంకజ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. ఆస్కార్‌కు అర్హత సాధించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు అకామెడీ అవార్డ్ విన్నర్స్ స్పైక్‌లీ, గునీత్ మోంగా కపూర్‌తోపాటు విలియం డఫో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించబోతున్నారు.
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..



