త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | కేసీఆర్‌కు నోటీసెందుకు పంపారో చెప్పండి: సీత‌క్క‌కు క్రిశాంక్ ప్ర‌శ్న‌

Manne Krishank | తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క లేఖ రాసింద‌ని.. అస‌లు స్మార్ట్ ఫోన్ల కుంభకోణం(Smarts phones scam) లో ఏ సంబంధం లేని కేసీఆర్‌కు లీగ‌ల్ నోటీసులు (legal notice) ఎందుకు పంపారో సీత‌క్క చెప్పాల‌ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Krishank) డిమాండ్ చేశారు.

S

News | Published On Apr 13, 2026, 4.12 pm IST

Manne Krishank | కేసీఆర్‌కు నోటీసెందుకు పంపారో చెప్పండి: సీత‌క్క‌కు క్రిశాంక్ ప్ర‌శ్న‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క లేఖ రాసింద‌ని.. అస‌లు స్మార్ట్ ఫోన్ల కుంభకోణం(Smarts phones scam) లో ఏ సంబంధం లేని కేసీఆర్‌కు లీగ‌ల్ నోటీసులు (legal notice) ఎందుకు పంపారో సీత‌క్క చెప్పాల‌ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Krishank) డిమాండ్ చేశారు. తాము తప్పుడు ఆరోపణలు చేస్తే సీబీఐ (CBI) విచారణ చెయ్యండి అని లేఖ రాయొచ్చు కదా అని అన్నారు. సీత‌క్క కేసీఆర్ కు లీగ‌ల్ నోటీస్ పంప‌డంపై సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. మాకు సంస్కారం ఉందని, మా నాయకుడు కేసీఆర్ అది నేర్పించార‌ని చెప్పారు. మీరు చెప్పుతో కొడితే ప‌డుతాం.. కానీ ప్ర‌జ‌లకు వాస్త‌వాలు చెప్పాలి క‌దా అని ఎద్దేవా చేశారు.

5g ఫోన్లు ఇస్తున్న‌మ‌నేవారిని ఏ చెప్పుతో కొట్టాలి..

మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5g మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం తన సోషల్ మీడియాలో అంగన్వాడి వర్కర్స్ కు 5 స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పోస్ట్ చేశారు. దీనికి సీత‌క్క‌ ఏం సమాధానం చెప్తారు. 4g ఫోన్లు ఇస్తూ.. 5g ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

రూ.30 కోట్లు ఎక్క‌డికి పోయాయో..

గౌరవ మంత్రి సీతక్క అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని.. కానీ కేసీఆర్‌కు లీగ‌ల్ నోటీసులు పంప‌డానికి కార‌ణ‌మేంటో చెప్పాల‌న్నారు. 35 వేల 310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని తాము గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నామ‌న్నారు. అంగన్వాడి వర్కర్స్ కు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ, తక్కువ ధరకు మొబైల్ కొనుగోలు చేసి ఇచ్చారని ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు టెండర్ రూ.54 కోట్లకు పిలిచి, 35 వేల 310 స్మార్ట్ ఫోన్లకు రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. మిగిలిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని అడ‌గ‌డం త‌ప్పెలా అవుతుంద‌న్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సీతక్క చెప్పుతో కొడతాం అని అన‌డం ఏంట‌ని నిల‌దీశారు. మా నాయకులపై కేసులు పెట్టి పిలిస్తే విచారణకు హాజరు అయ్యారు కదా.. సీతక్క అని ప్ర‌శ్నించారు.

సల్మాన్ ఖాన్ పక్కన, మిస్ వరల్డ్ పోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్ల‌కి ఇప్పించాడని మాకు అనుమానం ఉంది. డొక్కు ఫోన్లు పట్టుకొని ఇంటింటికి పోతే అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. అంగన్వాడి వర్కర్స్ కు ఇబ్బందులు పడుతారు. మెమరీ ధరలు పెరగడంతో కాంట్రాక్ట్ నుంచి సామ్ సంగ్ మొబైల్ సంస్థ ఎగ్జిట్ అయిందని అంటున్నారు.

అంగన్వాడి వర్కర్స్ కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్ నాకు సంబంధమే లేదని సీతక్క మాట్లాడి, ఇప్పుడు చెప్పుతో కొడుతా అని అనడం ఏంటి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి అందుకే మేము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే మాకు నమ్మకం ఉండదు అని క్రిశాంక్ అన్నారు.

Advertisement
Advertisement