త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vasudeva Reddy | తేజ‌స్వీ.. మ‌ర్యాదగా క్ష‌మాప‌ణ చెప్పు.. లేదంటే నాలుక చీరేస్తం: కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

Vasudeva Reddy | కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు (Inappropriate remarks) పూర్తిగా అనుచితమైనవి, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని.. అవి వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని రాష్ట్ర దివ్యాంగుల‌ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి (Kethireddy Vasudeva Reddy) వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల‌న్నారు.

S

News | Published On Apr 16, 2026, 4.59 pm IST

Vasudeva Reddy | తేజ‌స్వీ.. మ‌ర్యాదగా క్ష‌మాప‌ణ చెప్పు.. లేదంటే నాలుక చీరేస్తం: కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు (Inappropriate remarks) పూర్తిగా అనుచితమైనవి, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని.. అవి వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని రాష్ట్ర దివ్యాంగుల‌ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి (Kethireddy Vasudeva Reddy) వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల‌న్నారు. తెలంగాణ రాష్ట్రంపై, రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోర‌ని, నాలుక చీరేస్తారని హెచ్చ‌రించారు. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందని ప్ర‌శ్నించారు.

పిల్లి గుడ్డిదైతే ఎలుక‌లు ఎగిరెగిరి ప‌డిన‌ట్లు..

బీఆర్ఎస్ పార్టీ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి లోక్‌సభలో బలమైన స్వరం లేకపోవడం వల్ల, ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణపై ఇష్టానుసారంగా, వివక్షపూరితంగా వ్యాఖ్యలు చేయడానికి ధైర్యం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నాయకుల వాక్యాలను ప్రతి తెలంగాణ బిడ్డ తీవ్రంగా ఖండించాల్సిందే. ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి వాక్యాలు అసహ్యకరమైనవి. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు, ఇది తెలంగాణ ప్రజల గౌరవంపై నేరుగా దాడి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నప్పటికీ, తెలంగాణ గౌరవాన్ని కాపాడటంలో వారు పూర్తిగా విఫలమయ్యారు.

తెలంగాణ ప్రయోజనాలను రక్షించాల్సిన వారు మౌనం పాటించడం దురదృష్టకరం మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. నిజంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్ సభ సభ్యులు ఉండి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడేవారా? లోక్‌స‌భలో టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిథ్యం లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్య‌లు పునరావృతంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడే వారిపై కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ఎంపీలు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లే? తెలంగాణ సమాజం దీన్ని గమనించి ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.

స్పందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది..

ఇది ఒక సరళి (pattern)గా మారడం అత్యంత ఆందోళనకరం. గతంలో ఓసారి దేశ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా వంటి వారితో సైతం పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తెలంగాణపై ఈ విధమైన చిన్నచూపు ఇక అసహనం, ఇది తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరచడమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా స్పందించాల్సిన సమయం వచ్చింది అని వాసుదేవ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement