Jagga Reddy | మీకు శ్రీరాముడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా..? బీజేపీని నిలదీసిన జగ్గారెడ్డి
Jagga Reddy | మీకు శ్రీరాముడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా..! రాజకీయాలకు వాడుకొని ఇలా వదిలేస్తారా..! దొంగతనం జరిగితే ఇప్పటివరకు పట్టించుకోరా..? అని బీజేపీ నేతలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు.
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : మీకు శ్రీరాముడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా..! రాజకీయాలకు వాడుకొని ఇలా వదిలేస్తారా..! దొంగతనం జరిగితే ఇప్పటివరకు పట్టించుకోరా..? అని బీజేపీ నేతలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. ట్రస్ట్ సభ్యులతో రాజీనామా చేయించారు.. ఇంతేనా చేసేది అని ప్రశ్నించారు. ప్రతి భక్తుడికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. దేవుడి పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. దేవుడి పూజ చేసి మోదీ పబ్లిసిటీ తీసుకుంటారు. కానీ రాహుల్ గాంధీ పూజ చేస్తారు పబ్లిసిటీ తీసుకోరు. రాహుల్ గాంధీ దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెడుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
సాక్షాత్తు అయోధ్య రాముడి గుడిలో దొంగతనం జరిగింది. అయోధ్యలో గుడికి వెళ్ళే భక్తులు భక్తి, ప్రేమతో హుండీలో కానుకలు వేసి వెళ్తారు. ఏ రోజైతే అయోధ్య రామాలయంలో దొంగతం జరిగిందో అప్పటి నుండి మోడీ, అమిత్ షా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ తక్షణమే స్పందించారు. పార్లమెంట్ మెంబర్స్‌తో కమిటీ వేసి అయోధ్య వెళ్లి విజిట్ చేసి వచ్చారు. దేవుడి గుడిలో దొంగతనం జరగడంతో ప్రజల నమ్మకం పోయింది. దీనికి యూపీ, కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చారు
40 ఏళ్ల నుండి బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే కేవలం అయోధ్యలో రాముడి గుడి పేరుతోనే. కేవలం గుడి కట్టడమే మీ బాధ్యత కాదు. దాని సక్రమంగా చూసుకోవడం కూడా మీ బాధ్యతే. దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చారు కానీ మోడీ, అమిత్ షా ఎందుకు మాట్లాడలేదు. మేము రాజకీయం చేయడం లేదు... ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.
అయోధ్యలో దొంగతనం జరిగితే చిన్న విషయమా..!
రాముడి పాలసీనే జవహర్ లాల్ నెహ్రు అమలు చేశారు అలాగే పరిపాలించారు. రాముడు ఎలా పరిపాలించారు.. రాహుల్ కుటుంబం అలాగే పరిపాలించింది, పరిపాలిస్తుంది. కానీ పెద్ద పెద్ద మాటలు చెప్పే మోడీ, అమిత్ షా మాత్రం అలా చేయడం లేదు. కనీసం దొంగతనం జరిగితే ఇప్పటివరకు మోదీ, అమిత్‌షా బాధ్యతగా మాట్లాడలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ చిన్న చిన్నవి జరుగుతుంటాయని అంటున్నారు. అయోధ్యలో దొంగతనం జరిగితే చిన్న విషయమా..! రాంచందర్ రావు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఇది చిన్న విషయంగా కనిపిస్తుందా..! ప్రజలు ఇది గమనించాలి అని జగ్గారెడ్డి సూచించారు.
మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి
అదే కేంద్రంలో బీజేపీ అధికారంలో లేకపోతే, యూపీలో అధికారంలో లేకపోతే.. ఇలా దొంగతనం జరిగి ఉంటే ఊరుకునేవారా..? మీరు అధికారంలో ఉంటే చిన్నది..! కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెద్దదిగా చూపించి దేశం అంత ఉద్యమం చేసే వారు కదా..! కానీ రాహుల్ గాంధీ అలా చేయడం లేదు. దొంగతనం జరిగింది బాధ్యత తీసుకోండి అంటున్నారు. ఇదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడా. మతం పేరుతో బీజేపీ బ్రతుకుతుంది. కానీ కాంగ్రెస్ అన్ని కులమతాలని కలుపుకుంటూ వెళ్తుంది. ఇప్పటికైనా మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏఐని వాడండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●POCSO Case Hyderabad | బొమ్మల షాపులో బాలుడిపై అకృత్యం.. 56 ఏళ్ల కీచకుడికి మూడేళ్ల జైలు శిక్ష
- ●Revanth Reddy | అప్పుల సాకుతో తప్పించుకోలేం
- ●POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!
- ●Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!
- ●Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు

CM Revanth Reddy | ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏఐని వాడండి : సీఎం రేవంత్ రెడ్డి

POCSO Case Hyderabad | బొమ్మల షాపులో బాలుడిపై అకృత్యం.. 56 ఏళ్ల కీచకుడికి మూడేళ్ల జైలు శిక్ష

Revanth Reddy | అప్పుల సాకుతో తప్పించుకోలేం

POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!





