MLA Sanjay Kumar | జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలికలు: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar | జీవన్ రెడ్డి (Jeevan Reddy) కారణంగా బీఆర్ఎస్ (BRS) లో చీలికలు (Clashesh) వచ్చే ఛాన్స్ ఉందని, అందుకే ఆయన చేరిక రోజే హరీశ్‌రావు (Harish Rao) రహస్యంగా ఢిల్లీ (Delhi) వెళ్లారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
MLA Sanjay Kumar: త్రినేత్ర.న్యూస్: జీవన్ రెడ్డి (Jeevan Reddy) కారణంగా బీఆర్ఎస్ (BRS) లో చీలికలు (Clashesh) వచ్చే ఛాన్స్ ఉందని, అందుకే ఆయన చేరిక రోజే హరీశ్‌రావు (Harish Rao) రహస్యంగా ఢిల్లీ (Delhi) వెళ్లారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడాన్ని హరీశ్‌రావు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హరీశ్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఒక్క రోజు పండుగే. బీజేపీలో చేరాలన్న ఆలోచన చేయోద్దని హరీశ్‌రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సూచించారు. బీఆర్ఎస్ లోనే ఉండి జీవన్ రెడ్డి చేరికపై మనం పోరాడుదామని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి లాంటి ఐరన్ లెగ్ ను పార్టీలో ఉండే ఎదుర్కొందామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీని కాపాడుకుందామని చెప్పారు. జీవన్ రెడ్డి చేరిక సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన చేరికను హరీశ్‌రావు వ్యతిరేకించారు. జగిత్యాల సభ కు వెళ్లకుండా రహాస్యంగా ఢిల్లీ వెళ్లారు.
ఏడాది తర్వాత బయటకు వచ్చి జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటున్నారు. కేసీఆర్ సభకు వెళ్లకుండా హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారు.పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సభకు సీనియర్ నాయకుడైన హరీశ్ రావు వెళ్లడం లేదు. జీవన్ రెడ్డి చేరికపైన ఆయన అసంత్రుప్తిగా ఉన్నారు. ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా హరీశ్ ఇష్టపడలేదు. హరీశ్ రావు ఇంటికి వెళ్లి బుజ్జిగించి తనతో జగిత్యాల కు కేటీఆర్ తీసుకొచ్చారు. కేసీఆర్ ను కలవడానికి జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లినప్పుడు కూడా హరీశ్ కనిపించలేదు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ తోనే జీవన్ రెడ్డి భేటీ అయ్యారు.
నేడు జీవన్ రెడ్డి చేరిక సమయంలో జగిత్యాల రాకుండా ఢిల్లీకి వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు జీవన్ రెడ్డి ది ఐరన్ లెగ్ గా భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు పోయి కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది. జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరింత నారాజ్ లో ఉన్నారు. చేరిక నచ్చని కొందరు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీ లు తొలగించారు. జీవన్ రెడ్డి వల్ల ఎన్టీఆర్ తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్ పదవి కోల్పోయారు. 2009లో రెండవ సారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా వైఎస్ ఆర్ చనిపోయారు. గతంలో జీవన్ రెడ్డి రేవంత్ కావాలి.. కేసీఆర్ పోవాలి అన్నారు. ఒక నెల రోజుల నుండి రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని అంటున్నారు.
ఇవి పూర్తిగా ప్యాకేజీ మాటలు..
రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచాను. ఇరిగేషన్ పై పూర్తి అవగాహన ఉంది. మేడిగడ్డ సభలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ అభివృద్ధి పనులపై స్పష్టమైన ఆదేశాలు హామీలు ఇస్తారని భావిస్తున్నా. జగిత్యాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా. రాష్ట్ర స్తాయి రాజకీయాల్లో జీవన్ రెడ్డి పార్టీ వీడడంలో నా జోక్యం ఎప్పుడూ లేదు. ఇవి పూర్తిగా ప్యాకేజీ మాటలు. ఇలాంటి మాటలు సీనియర్ రాజకీయం అనుభవం ఉండి మాట్లాడటం విడ్డూరం గా ఉంది అని సంజయ్ అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



